పోలీసులపై చంద్రబోస్ పాట.. ఫిదా అయిన మెగాస్టార్

కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు ముందుండి పోరాడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరి సేవలను ప్రజలందరినీ నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే కొందరు లాక్డౌన్ సమయంలో పనిలేకున్న రోడ్లపై వస్తూ పోలీసులను విసిగిస్తున్న సంఘటనలు చూస్తున్నాం. ఈమేరకు పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇళ్లకే పరిమితమయ్యేలా చేస్తున్నారు. దీంతో పోలీసులు అందిస్తున్న సేవలపై ప్రముఖ సీని రచయిత చంద్రబోస్ ‘ఆలోచించండి.. అన్నలారా?.. ఆవేశం మానుకోండి తమ్ములారా’ అంటూ అద్భుతమైన పాటను రాశాడు. ఈ పాట […]

Written By: Neelambaram, Updated On : April 25, 2020 8:02 pm
Follow us on


కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు ముందుండి పోరాడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరి సేవలను ప్రజలందరినీ నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే కొందరు లాక్డౌన్ సమయంలో పనిలేకున్న రోడ్లపై వస్తూ పోలీసులను విసిగిస్తున్న సంఘటనలు చూస్తున్నాం. ఈమేరకు పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇళ్లకే పరిమితమయ్యేలా చేస్తున్నారు. దీంతో పోలీసులు అందిస్తున్న సేవలపై ప్రముఖ సీని రచయిత చంద్రబోస్ ‘ఆలోచించండి.. అన్నలారా?.. ఆవేశం మానుకోండి తమ్ములారా’ అంటూ అద్భుతమైన పాటను రాశాడు. ఈ పాట ప్రతీఒక్కరినీ ఆలోచించేలా ఉంది. ఈ పాటను చూసిన మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన పాట రాశావంటూ చంద్రబోస్ ను ప్రశంసించారు.

ఈ పాటను చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా రీట్వీట్ చేశారు. ‘కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి మన కోసం పోలీస్ శాఖ పోరాడుతోందని ఆయన అన్నారు. ప్రతీఒక్కరం పోలీసులందరినీ గౌరవిద్దాం.. వాళ్లకు సహకరిద్దాం.. అని పేర్కొన్నారు. చంద్రబోస్ ఆలపించిన పాట పోలీస్ శాఖ గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రజల్లో ఆలోచనలు రేకెత్తిస్తోంది’ మెగాస్టార్ ట్వీట్ చేశారు. అలాగే సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను, సైబరాబాద్ పోలీస్‌ను మెగాస్టార్ ట్వీటర్లో ట్యాగ్ చేశారు. కాగా ఈ పాటను సీపీ సజ్జనార్ సూచన మేరకు రాశానని చంద్రబోస్ తెలిపారు. ‘ఆలోచించండి అన్నలారా, ఆవేశం మానుకోండి తమ్ముల్లారా..’ పాటను ఎంతో బాధ్యతతో రాశానని చంద్రబోస్ తెలిపారు. ఈమేరకు చంద్రబోస్‌ని సీపీ సజ్జనార్ స్వయంగా సత్కరించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.