Chandini Chowdary: చాందిని చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యూట్ లుక్స్ తో స్వీట్ వాయిస్ తో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది ఈ భామ. షార్ట్ ఫిలిమ్స్ తో తన ప్రయాణం మొదలు పెట్టి వెబ్ సిరీస్ లలో దూసుకొని పోతుంది.కమర్షియల్ గా గుర్తింపు రాకపోయినా.. ప్రయోగాత్మక సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది చాందిని. రీసెంట్ గా వచ్చిన గామి సినిమాతో మెప్పించింది. ఈమె మెయిన్ లీడ్ లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకోవడమే కాదు రూ. 25 కోట్లు కలెక్ట్ చేసింది.
ఈ సినిమాలో చాందిని చౌదరి రిస్క్ ఫ్యాక్టర్స్ తోనే నటించిందని చెప్పాలి. హిమాలయాల్లో ఎన్నో కష్టాలు పడి మరీ ఈ సినిమాకు మంచి హైప్ తెచ్చింది. ఐదు సంవత్సరాల పాటు సినిమా సాగిన కూడా నమ్మకం పెట్టుకుంది. అంతేకాదు సినిమా కోసం చాలా రిస్క్ షాట్స్ ను చేసింది అమ్మడు. ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది అభినందిస్తున్నారు. అభిమానిస్తున్నారు. అయితే ఈ సినిమా టీమ్ రీసెంట్ గా తిరుమలకు వెళ్లారు. తిరుమలలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
దర్శనం అనంతరం ఓ థియేటర్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో హీరో చాందిని,డైరెక్టర్, విశ్వక్ సేన్ పాల్గొన్నారు. ప్రశ్నలు అడుగుతున్న నేపథ్యంలో చాందినిని ఎవరు కూడా ప్రశ్నలు అడగలేదు. చివర్లో సినిమా సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు అంటూ.. అసహనం వ్యక్తం చేసింది. ఏంటో అందరూ డైరెక్టర్స్, హీరోలనే ప్రశ్నలు అడుగుతారు. ఫిమేల్ యాక్టర్లను ప్రశ్నలు అడగరు అంటూ.. ఎప్పటి నుంచో ఇలాగే చూస్తున్నాను ప్రెస్ మీట్స్ లలో లేడీ ఆర్టిస్టులను ప్రశ్నలే అడగరు అంటూ కామెంట్స్ చేసింది చాందిని చౌదరి.
వెంటనే ఓ మీడియా ప్రతినిధి ఓ ప్రశ్న అడిగితే.. మొహమాటానికి వద్దు లెండి అంటూ వెంటనే అనేసింది. ప్రెస్ మీట్ కాదు నువ్వు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతాయి చూడు అంటూ విశ్వక్ సేన్ సరదాగా అన్నాడు. కానీ ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే ఇలాంటివి చాలా మందిలో ఉండవచ్చు. కానీ ఎవరు బయటపెట్టరేమో.. అయినా అందరిని సమానంగా ప్రశ్నలు అడిగి ఉంటే బాగుండు.. పాపం ప్రెస్ మీట్ మొదటి నుంచి ఎవరు మాట్లాడించకపోయి ఉంటే బాధ పడినట్టు ఉందంటూ ఆమె అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
‘Obviously no one has questions for actresses. Male actorsకి, directorsకి ఉంటాయ్ questions మీ దగ్గర, heroinesని అసలు questionలే అడగరు.. ఎప్పటినుండో చూస్తున్నా….’
– #ChandiniChowdary at #GAAMI press meet in Tirupati. pic.twitter.com/kSbDM8FyMr
— Gulte (@GulteOfficial) March 13, 2024