The Raja Saab: ‘రాజా సాబ్'(Rajasaab Movie) చిత్రానికి చివరి నిమిషం లో అన్నీ భలే కలిసి వచ్చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాకు హైప్ లేదు, ఓవర్సీస్ బుకింగ్స్ చాలా డల్ గా ఉన్నాయి అని అనుకునేవాళ్లు. కానీ గత రెండు రోజుల నుండి ఓవర్సీస్ లో కలెక్షన్స్ బాగా పిక్ అయ్యాయి. టికెట్ రేట్స్ వస్తాయో లేదో అని భయపడేవారు. కాసేపటి క్రితమే ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్స్ జీవో వచ్చేసింది, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ప్రీమియర్ షోస్ టికెట్స్ కొన్ని చోట్ల హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి, కొన్ని చోట్ల డల్ గా ఉన్నాయి. ఇక తెలంగాణ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్, టికెట్ రేట్స్ జీవో రేపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్ని ఒక ఎత్తు అయితే, ఈ సినిమాతో పాటు విడుదల కావాల్సిన ‘జన నాయగన్'(Jana Nayagan Movie) చిత్రం వాయిదా పడడం మరో ఎత్తు. ఒక్క మాటలో చెప్పాలంటే జాక్పాట్ అనే చెప్పాలి.
ఈ సినిమా తెలుగు వెర్షన్ కి కూడా మంచి రిలీజ్ ఇచ్చారు. ప్రతీ సెంటర్ లోను టాప్ థియేటర్ ని బుక్ చేసుకున్నారు బయ్యర్స్. మా సినిమాకు సోలో రిలీజ్ లేకుండా పోతుందే అని ప్రభాస్ అభిమానులు ఏడవని రోజంటూ లేదు. ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడడం తో, ‘జన నాయగన్’ కి కేటాయించిన థియేటర్స్, రాజాసాబ్ కి వెళ్లిపోతున్నాయి. దీని వల్ల గ్రాస్ నంబర్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో రావొచ్చు. ఉదాహరణకు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ని తీసుకుందాం. ఇక్కడ ‘రాజాసాబ్’ కి కేవలం మూడు థియేటర్స్ మాత్రమే కేటాయించారు. ఇప్పుడు ‘జననాయగన్’ వాయిదా పడడంతో ఆ థియేటర్స్ అన్ని రాజా సాబ్ కి వెళ్లిపోయాయి. దీని వల్ల మొదటి రోజు 80 లక్షలు చేయాల్సిన సినిమా, కోటి 30 లక్షలు చేసే రేంజ్ కి వెళ్ళింది.
ఇక ఓవర్సీస్ లో కూడా ఇదే పరిస్థితి. జననాయగన్ చిత్రానికి కేటాయించిన షోస్ మొత్తం రాజా సాబ్ కి వెళ్లిపోనున్నాయి. ప్రైమ్ టైం షోస్ కూడా రాజా సాబ్ కి రానున్నాయి. ఇది మామూలు రేంజ్ బూస్ట్ కాదు. మొత్తానికి ‘రాజాసాబ్’ జాక్పాట్ కొట్టినట్టే. మొదటి రోజు ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ ని రాబడుతుందా లేదా అనే అనుమానం ఉండేది. కానీ ఇప్పుడు వంద కోట్ల గ్రాస్ ఓపెనింగ్ పై అంచనాలు పెట్టుకోవచ్చు. చూడాలి మరి ప్రభాస్ స్టామినా ఈ గ్యాప్ ని ఎలా ఉపయోగించుకోబోతుంది అనేది.