Champion OTT Release Date: గత ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదలైన ‘ఛాంపియన్'(Champion Movie) చిత్రం డివైడ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గ్రాసర్ గా నిల్చింది. ‘పెళ్లి సందడి’ చిత్రం తర్వాత శ్రీకాంత్ కొడుకు రోషన్(Roshan Meka) హీరో గా నటించిన సినిమా ఇది. భారీ గ్యాప్ తో వచ్చిన ఈ చిత్రం కథ పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ, డైరెక్టర్ టేకింగ్ విషయం లో అత్యధిక చోట్ల తడబడడంతో ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. ట్రేడ్ విశ్లేషకులు అందించిన లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను వచ్చాయి. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయి అంటే అందుకు కారణం రోషన్ పై జనాల్లో ఉన్న పాజిటివ్ ఫీలింగ్ వల్లే అని విశ్లేషకులు అంటున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది.
ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా ఈ చిత్రాన్ని ఈ నెల 29 న నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నెట్ ఫ్లిక్స్ కాసేపటి క్రితమే చేసింది. అనశ్వర రాజన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరోల్లో ఒకరైన దుల్కర్ సల్మాన్ కీలక పాత్ర పోషించాడు. మరి థియేటర్స్ లో యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా, కనీసం ఓటీటీ ఆడియన్స్ ని అయినా అలరిస్తుందో లేదో చూడాలి.
చాలా సినిమాలు థియేటర్స్ లో ఫ్లాప్ అయినప్పటికీ ఓటీటీ లో మాత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని తెచ్చుకున్నాయి, అలా ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. ఇకపోతే రోషన్ తన తదుపరి చిత్రాన్ని ‘హిట్’ సిరీస్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం లో చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై నాగవంశీ నిర్మించబోతున్నాడు. రోషన్ కి కచ్చితంగా స్టార్ హీరో అయ్యేంత స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది , యాక్టింగ్ టాలెంట్ కూడా ఉంది. సరైన స్క్రిప్ట్ తగిలితే ఓవర్ నైట్ స్టార్ అయిపోగలడు, తన తదుపరి చిత్రం తో ఆ రేంజ్ కి వెళ్లే అవకాశం ఉంది, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.