Chammak Chandra: ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి , నేడు బడా పాన్ ఇండియన్ సినిమాల్లో కూడా నటించేస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు చమ్మక్ చంద్ర. జబర్దస్త్ షో అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి ప్రధానమైన కారణాల్లో చమ్మక్ చంద్ర కూడా ఒకడు. ఆయన స్కిట్స్ కి యూట్యూబ్ లో వందల మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. డిఫరెంట్ కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ చమ్మక్ చంద్ర లోని స్పెషల్ లక్షణాలు. ఇవే టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ ని , హీరోలను ఆకర్షించింది. అందుకే ఆయనకు వరుసగా పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా ఆయన ‘పెద్ది’ మూవీ లో నటించాడు. ఈ చిత్రం లో ఆయన హీరోయిన్ జాన్వీ కపూర్ కి అసిస్టెంట్ గా చేశాడు.
నటనలో స్కోప్ తక్కువే కానీ , ప్రేక్షకులు మాత్రం ఆయన గెటప్ ని ఎప్పటికీ మర్చిపోలేరు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే డైరెక్టర్ బుచ్చి బాబు హీరోయిన్ జాన్వీ కపూర్ మరియు చమ్మక్ చంద్ర మధ్య జరిగిన ఒక సంఘటన గురించి చెప్పొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ఒకరోజు మాకు చమ్మక్ చంద్ర అందుబాటులో లేడు, అదే రోజున జాన్వీ కపూర్, చంద్ర కాంబినేషన్ లో మేము షూట్ ప్లాన్ చేశాము. సినిమాలో హీరోయిన్ పాత్ర ఉన్నంత సేపు చంద్ర ఉంటాడు , అంత కీలకమైన పాత్ర డేట్స్ దొరక్కపోతే ఎలా అని భయపడ్డాము. జాన్వీ కపూర్ షూటింగ్ కోసం ఫోన్ చేస్తే, చంద్ర డేట్స్ దొరకలేదని చెప్పాము. అప్పుడు జాన్వీ నేరుగా చమ్మక్ చంద్ర కి వీడియో కాల్ చేసింది. ఏంటి చంద్ర డేట్స్ లేవని డైరెక్టర్ తో చెప్పావంట, ముందు నువ్వు షూటింగ్ కి వచ్చేయ్ అని అన్నిందట. ఆమె ఫోన్ చేసినప్పుడు నేను చొక్కా కూడా వేసుకోలేదని చమ్మక్ చంద్ర చెప్పాడు’ అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ బుచ్చి బాబు.
ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇక పెద్ది విషయానికి వస్తే రోజు రోజుకు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నమోదు చేస్తున్న వసూళ్లను చూస్తుంటే , ఈ చిత్రం కచ్చితంగా ఫుల్ రన్ లో 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. రెండు రోజుల్లో దాదాపుగా 155 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 97 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది ఈ చిత్రం. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి మరో 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి , మరి ఆ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది చూడాలి.
