Samantha: అదేంటో సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్యలో చాలా మార్పులు వచ్చాయి. అవును ఈ మాట ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో కూడా బాగా వినిపిస్తోంది. తన విడాకుల సంగతి ప్రకటించిన తర్వాత, చైతు ముఖం సంతోషంతో వెలిగిపోతుందట. ఇంతకీ చైతు అంతలా మారిపోవడానికి గల కారణం మాత్రం తెలియలేదు. మరోపక్క కెరీర్ లోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు.

ప్రస్తుతం వరుస కథలు వింటున్నాడు. అందుకే, సడెన్ గా తన కొత్త సినిమాల అప్ డేట్ పై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు చైతు. నిజానికి నాగ చైతన్య ఒకప్పుడు సోషల్ మీడియా అంటే చిరాకు పడేవాడు. అందుకే, సోషల్ మీడియా ఎకౌంట్స్ ను వినియోగించడానికి కూడా పెద్దగా ఇష్టపడేవాడు కాదు. ఎంతో అవసరమైనప్పుడు మాత్రమే చైతు ట్వీట్ చేసేవాడు.
అయితే సమంత మాత్రం నిత్యం ట్వీట్లతో రెచ్చిపోతూ కనిపించేది. సామ్ అంతగా రెచ్చిపోతున్న చైతన్య మాత్రం అడపాదడపా పోస్ట్ లే చేసేవాడు. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. ఈ మధ్య సమంత ట్విట్టర్ ని వాడటం బాగా తగ్గించేసింది. సామ్ తగ్గించగానే చైతన్య తన సినిమాల ప్రొమోషన్ కోసం ట్విట్టర్ ని బాగా వాడుతున్నాడు. డైలీ ఏదొక పోస్ట్ పెడుతూ వస్తున్నాడు.
ముఖ్యంగా తన ‘లవ్ స్టోరీ’ సినిమా నుంచే చైతు ఈ పద్దతి ఫాలో అవుతున్నాడు. చైతు ‘బంగార్రాజు’ సినిమాలో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాకి సంబంధించి అప్పుడే హడావిడి మొదలు పెట్టేశాడు. ఈ సినిమా పోస్టర్ లను అప్పుడే ప్రమోట్ చేస్తున్నాడు. ఒకప్పుడు చైతు తన సొంత సినిమాలనే ప్రమోట్ చేసుకునే వాడు కాదు.
Also Read: Pawan Kalyan: పవన్ మాత్రమే హైలైట్ అయితే హిట్ అవ్వడం కష్టమే !
కానీ సమంతకి డివోర్స్ ఇవ్వాలని ఓ నిర్ణయానికి వచ్చాక, నాగ చైతన్య తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలని బలంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ట్విట్టర్ వాడకం సమంత తగ్గించింది, చైతు పెంచాడు.
Also Read: Tollywood heros: మన హీరోలు కూడా ఇలా ఆలోచిస్తే మంచిది !