Chaari 111 Movie Review: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్లందరు హీరోలుగా మారుతూ సినిమాలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక గత వారం సుందరం మాస్టారు సినిమాతో వైవాహర్ష తన అదృష్టాన్ని పరీక్షించుకోగా, ఈ వారం వెన్నెల కిషోర్(Vennela Kishore) ‘చారి 111’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిజానికి వెన్నెల కిషోర్ అంటే కామెడీ పాత్రలని అత్యద్భుతంగా పోషిస్తూ ప్రేక్షకుల్లో నవ్వులు పండించగలిగే నటుడనే చెప్పాలి. ఈ జనరేషన్ లో ఉన్న కమెడియన్ల లో వెన్నెల కిషోర్ నెంబర్ వన్ స్థానంలో ఉంటాడనే చెప్పాలి. ఇక అలాంటి కమెడియన్ హీరోగా మారి చేసిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? హీరోగా సక్సెస్ అయ్యాడా లేదా అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ కథ విషయానికి వస్తే ప్రసాద్ రావు (మురళి శర్మ) దేశంలో జరిగే కొన్ని ఇల్లీగల్ పనుల నుండి దేశాన్ని కాపాడటమే ధ్యేయంగా పెట్టుకొని ఆయన తన లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలో ప్రసాద్ రావు ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక ఏజెన్సీ ని స్టార్ట్ చేస్తారు. దాని పేరు రుద్రనేత్ర అని ఫిక్స్ చేస్తారు. ఇలాంటి సమయంలోనే హైదరాబాద్ లో సూసైడ్ బాంబ్ అటాక్స్ జరిగే మిషన్ ను డీల్ చేయడానికి ఎవరు దొరకరు. ఇక అప్పుడు చారి (వెన్నెల కిషోర్) అనే వ్యక్తిని ఈ కేసును డీల్ చేయడానికి పెడతారు. ఈయనని నియమించడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే శ్రీనివాస్ (బ్రాహ్మజీ) అనే ఒక బిజినెస్ మ్యా ను పట్టుకోడానికి ఇతన్ని స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తారు. ఇక ఈ క్రమంలో చారి శ్రీనివాస్ ని పట్టుకోడానికి వెళ్తాడు. ఇక అక్కడ ఇంతకుముందే ఈషా (సంయుక్త) అనే ఒక ఏజెంట్ శ్రీనివాస్ కేసు విషయంలో వర్క్ చేస్తూ ఉంటుంది. ఇక ఒకరోజు సమయం చూసి ఆమె శ్రీనివాస్ దగ్గర నుంచి ఒక సూట్ కేస్ ని దొంగలిస్తుంది. అందులో ఏముంది.? ఈశా ఎజెంటా లేదంటే వేరే దురుద్దేశంతో ఏజెంట్ అని చెప్పుకొని తిరుగుతుందా.? అసలు చారి ఈ కేస్ ని ఎలా సాల్వ్ చేశాడు అనే విషయాలు తెలియాలంటే మీరు తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే సినిమా దర్శకుడు టీజీ కీర్తి కుమార్ ఈ సినిమా కోసం తీసుకున్న స్టొరీ బాగానే ఉన్నప్పటికీ, దాన్ని డీల్ చేసిన విధానంలో ఆయన కొంతవరకైతే ఇబ్బంది పడ్డట్టుగా కనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా కామెడీ సీన్స్ తో నడిపించినప్పటికీ సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ అనవసరంగా సినిమాలో పెట్టారేమో అనేంతలా సినిమా చూసే ప్రేక్షకుడికి అనిపిస్తూ ఉంటుంది. ఇక కొన్ని సీన్లని కామెడీ పరంగా ఎగ్జిక్యూట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. అలాగే ఆ కామెడీ సీన్లకి రాసిన డైలాగులు గాని, వాటిని తెరకెక్కించిన విధానం గానీ ఓకే అనిపించింది. ఇక సెకండాఫ్ లో ఒక ట్విస్టుతో ఈ సినిమా ప్రేక్షకులకు కొంత వరకు హై ఫీల్ ఇస్తుంది. కానీ కొన్ని సీన్లలో మాత్రం క్లారిటీ మిస్సైంది. చూసే ఆడియన్ కి ఆ సీన్లు సినిమాలో లేకపోయిన పెద్దగా ఇంపాక్ట్ అయితే ఉండేది కాదు కదా అనిపించేంతలా ఆ సీన్లు పంటికింద రాయి లాగా తగులుతూ ఉంటాయి. ఇక ఇలాంటి వాటిని దర్శకుడు స్క్రిప్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడే తీసేసి ఉంటే బాగుండేది… దానివల్ల సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఒక మూడ్ లో వెళుతుంటే ఈ సీన్ల వల్ల వాడు ఆటోమేటిక్ గా డైవర్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఒక సినిమా తీసినప్పుడు స్క్రిప్ట్ స్టేజ్ లోనే అనవసరమైన సీన్లను గుర్తించి వాటిని అక్కడే కట్ చేస్తే స్టోరీ చాలా గ్రిప్పింగ్ గా రావడమే కాకుండా ఆ సీన్స్ కూడా ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తాయి. అందుకోసమే షూట్ కి వెళ్ళే ముందే స్క్రిప్ట్ మొత్తాన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మరి సినిమాగా తెరకెక్కించాలి. ఈ సినిమా దర్శకుడు అయిన కీర్తి కుమార్ సినిమాని ఎంగేజ్డ్ తీసుకు వెళ్ళాడు. కానీ మధ్యలో అక్కడ కొంచెం ప్రేక్షకుడికి బోర్ కొట్టించేలా సీన్స్ ఉండటమే ఈ సినిమాకి పెద్ద మైనస్ గా మారింది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్ట్ లా పర్ఫామెన్స్ విషయానికి వస్తే వెన్నెల కిషోర్ ఈ సినిమాలో సెటిల్డ్ గా పర్ఫామ్ చేశాడు. ఇక తన మార్క్ కామెడీని చూపిస్తూనే కొన్ని సీన్లల్లో ఎమోషన్ ని కూడా పండించాడు. ఇక మొత్తానికైతే వెన్నెల కిషోర్ సినిమా మొత్తాన్ని ఒక్కడే తన భుజాల మీద మోసాడనే చెప్పాలి. ఇక హీరోయిన్ అయిన సంయుక్త విశ్వనాథన్ తన క్యారెక్టర్ లో లీనమై పోయి నటించి ఈ సినిమాకి చాలావరకు ప్లస్ అయిందనే చెప్పాలి. తాగుబోతు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రవీంద్ర వాళ్ళ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. ఇక బ్రహ్మాజీ ఈ సినిమాలో మరొక కీలక పాత్రలో నటించడమే కాకుండా చాలా మంచి కామెడీ ని కూడా జనరేట్ చేశాడానే చెప్పాలి…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సీమన్ కె కింగ్ అందించిన మ్యూజిక్ ఓకే అనిపించింది. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సీన్స్ ని ఎలివేట్ చేసేలా చాలా బాగా ఇచ్చాడనే చెప్పాలి. ఆయన మ్యూజిక్ వల్లే సీన్లు నార్మల్ గా కాకుండా ప్రేక్షకుడి లో మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాయనే చెప్పాలి. ఎడిటర్ రిచర్డ్ కెవిన్ ఉన్న సీన్లని చాలా గ్రిప్టింగ్ గా కట్ చేసినప్పటికీ సినిమాలో అనవసరమైన సీన్లని ఎడిటింగ్ రూమ్ దగ్గరైన కట్ చేసి ఉంటే బాగుండేది. దానివల్ల సినిమా మీద ఇంపాక్ట్ అనేది ఇంకొంచెం పెరిగేది…
ప్లస్ పాయింట్స్
కథ
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
వెన్నెల కిషోర్
మైనస్ పాయింట్స్
కొన్ని అనవసరమైన సీన్లు
కొన్ని సీన్లల్లో డైరెక్షన్
రేటింగ్
ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.5/5
చివరి లైన్
ఖాళీ గా ఉంటే ఫ్యామిలీ తో కలిసి వెళ్ళి ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు…