https://oktelugu.com/

Sai Dharam Tej: హీరో సాయి ధరమ్ తేజ్ ని కలిసిన కేంద్ర మంత్రి… కారణం ఏంటంటే ?

Sai Dharam Tej: ప్రముఖ హీరో సాయిధరమ్ తేజ్ ఇటీవల రోడ్ యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసింది. అదే సమయం లోనే సాయి తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం కూడా విడుదలైంది. అయితే చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో చేరిన సాయిధరమ్ తేజ్ ఈ మూవీ ప్రమోషన్స్ లో సైతం పాల్గొనలేకపోయాడు. 35 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన సాయి ధరమ్ తేజ్ చావు అంచువరకూ వెళ్లి తిరిగొచ్చాడు. మెగా ఫ్యామిలీ అభిమానులతో పాటు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 2, 2022 / 11:31 AM IST
    Follow us on

    Sai Dharam Tej: ప్రముఖ హీరో సాయిధరమ్ తేజ్ ఇటీవల రోడ్ యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసింది. అదే సమయం లోనే సాయి తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం కూడా విడుదలైంది. అయితే చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో చేరిన సాయిధరమ్ తేజ్ ఈ మూవీ ప్రమోషన్స్ లో సైతం పాల్గొనలేకపోయాడు. 35 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన సాయి ధరమ్ తేజ్ చావు అంచువరకూ వెళ్లి తిరిగొచ్చాడు. మెగా ఫ్యామిలీ అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన వాళ్ళకు కృతజ్ఞతలు తెలిపాడు తేజ్.

    తాజాగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సాయిధరమ్ తేజ్ ఇంటికెళ్ళి పరామర్శించారు. ఆరోగ్య విషయమై సాయి ధరమ్ తేజ్ ని ఆరా తీశారు. బిజీ షెడ్యూల్ లోనూ వీలు కల్పించుకుని కిషన్ రెడ్డి తన ఇంటికి వచ్చి పరామర్శించారని అందుకు కృతజ్ఞతలని తేజ్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు తేజ్. కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదానికి గురై డిశ్చార్జ్ అయిన తర్వాత నుంచి సాయి తేజ్ ఇంటి పట్టునే ఉంటున్నారు.

    డిశ్చార్జ్ అయిన తర్వాత చిరంజీవి ఒకటి రెండు సార్లు అందరితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. రిపబ్లిక్ సినిమా ఓటీటీలో రిలీజవుతున్న సమయంలోనూ మీడియాకు కొన్ని ఫోటోలు విడుదల చేశారు. అయితే అప్పుడు ముఖం కనిపించనీయలేదు. పూర్తి స్థాయిలో ఇప్పుడే ఆయన ఫోటోలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఆయన ఫిజియోధెరపి చేయించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక సాయి తేజ్ కొత్త సినిమా గురించి, షూటింగ్‌లో పాల్గొనే విషయాల గురించి ఇంకా వెల్లడించాల్సి ఉంది.