Coolie Movie A Certificate: కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు చూసుకుంటే, సూపర్ స్టార్ రజనీకాంత్(Super Star Rajinikanth) సినిమాలు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కుటుంబ సమేతంగా థియేటర్ కి వెళ్లి చూడదగినవి గా ఉండేవి. అందుకే ఆయన సౌత్ లో తిరుగులేని సూపర్ స్టార్ గా ఎదిగాడు. దశాబ్దాల నుండి ఆయనకు పోటీ ని ఇచ్చేవారు లేరు. అలాంటి రజనీకాంత్ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్ ని జారీ చేయడమే ఇప్పుడు ఇండస్ట్రీ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. A సర్టిఫికేట్ అంటే కేవలం 18 ఏళ్ళ వయస్సు దాటినా వారు మాత్రమే థియేటర్ కి వచ్చి సినిమా చూడాలి. అంతకంటే చిన్న వయస్సు ఉన్నవారికి థియేటర్ లో చూసేందుకు అనుమతి లేదు. ఈ రూల్ ని సింగల్ స్క్రీన్ థియేటర్స్ యాజమాన్యాలు పెద్దగా అనుసరించవు కానీ, మల్టీప్లెక్స్ థియేటర్స్ యాజమాన్యాలు మాత్రం తూచా తప్పకుండా అనుసరిస్తూ ఉంటాయి.
Also Read: పవన్ కళ్యాణ్ నుండి తీసుకోడానికి ఏమి లేవా..? శృతి హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు!
దీనివల్ల నిర్మాతలకు భారీ నష్టాలు వస్తుంటాయి. ఒక సినిమాకు A సర్టిఫికేట్ వచ్చిందంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్ వైపు వెళ్ళడానికి ఆలోచిస్తుంటారు. 36 ఏళ్ళ తర్వాత రజనీకాంత్ సినిమాకు A సర్టిఫికేట్ రావడం ఈ ‘కూలీ'(Coolie Movie) చిత్రానికే జరిగింది. ట్రైలర్ ని చూస్తుంటే చాలా సాఫ్ట్ గా ఉంది, పెద్దగా హింసాత్మక సన్నివేశాలు కానీ, బూతులు కానీ కనిపించలేదు, ఇలాంటి సినిమాకు A సర్టిఫికేట్ ఏంటి అని రజనీకాంత్ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేశారు. ట్రైలర్ లో పెద్దగా ఏమి చూపించి ఉండకపోయి ఉండొచ్చు కానీ, సినిమాలో మాత్రం బూతులు, హింసాత్మక సన్నివేశాలు చాలానే ఉన్నాయట. ట్రైలర్ కట్ అలా ఉండడానికి కారణం అంచనాలను స్టేబుల్ చేయడం కోసం మాత్రమేనట. మీరు ఈ సినిమా గురించి ఏది అయితే ఊహించి లోపలకు వస్తారో, కచ్చితంగా అది మాత్రం కాదు, మీ అందరినీ సర్ప్రైజ్ కి గురి చేసే విధంగా ఈ సినిమా ఉంటుంది అంటూ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఏంటో తెలియాలంటే మరో 8 రోజులు ఆగాల్సిందే. ఇకపోతే ఈ చిత్రం లో అక్కినేని నాగార్జున విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో హింసాత్మక సన్నివేశాలు, అదే విధంగా బూతులు అత్యధిక శాతం ఆయన నుండే ఉన్నాయట. అందుకే సెన్సార్ బోర్డు A సెర్టిటికేట్ ని జారీ చేసిందని అంటున్నారు. నిన్న నాగార్జున ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ‘నా క్యారక్టర్ ని నేను మానిటర్ మీద చూసుకొని, మనుషులు నిజంగా ఇంత క్రూరంగా ఉంటారా అని లోకేష్ ని అడిగాను, అప్పుడు లోకేష్ ఇంతకంటే క్రూరంగా కూడా ఉంటారు సార్ అని చెప్పాడు’ అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. అంటే ఆయనకు ఎలాంటి సన్నివేశాలు ఉండుంటాయో మీరే ఊహించుకోండి.