Homeఎంటర్టైన్మెంట్Celebrity Divorces: కోట్ల రూపాయలు భరణంగా ఇచ్చి విడాకులు తీసుకున్న 5సెలెబ్రేటిస్ ఎవరంటే ?

Celebrity Divorces: కోట్ల రూపాయలు భరణంగా ఇచ్చి విడాకులు తీసుకున్న 5సెలెబ్రేటిస్ ఎవరంటే ?

Celebrity Divorces: సినీ సెలబ్రిటీల వ్యక్తిగత విషయంలో పెళ్లి, విడాకులు అనేవి ఈ మధ్య చాలా కామన్ అయిపోయాయి. వారు ఎంత త్వరగా ప్రేమలో పడిపోయి పెళ్లి చేసుకుంటున్నారో అంతే త్వరగా విడాకులు కూడా తీసుకున్నారు. అయితే 1990వ దశకం నుంచి నేటి వరకు కూడా చాలామంది సినీ సెలబ్రిటీలు విడాకుల సందర్భంగా తమ భార్యలకు కోట్ల రూపాయల భరణం ఇస్తున్నారు. అలా భార్యలకు కోట్ల రూపాయలు భరణం ఇచ్చిన సెలబ్రిటీలు ఎవరో తెలుసుకుందాం.

1990వ దశకంలో బాలీవుడ్ ను ఊపేసిన కరిష్మాకపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె సంజయ్ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అమెరికాలో స్థిరపడిన తర్వాత వీరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. ఈ సందర్భంగా కరిష్మా కపూర్ కు సంజయ్ కపూర్ రూ.11 కోట్లు భరణంగా ఇచ్చారు. అలాగే ఖరీదైన ఇల్లు, కొన్ని కార్లను కూడా గిఫ్ట్ గా ఇచ్చారు.

Celebrity Divorces
Prabhudeva

ఇండియన్ మైకేల్ జాక్సన్ అయిన ప్రభుదేవ కూడా నయనతారను మ్యారేజ్ చేసుకునేందుకు గాను తన మొదటి భార్య రమాలత్ కు రూ.25 కోట్లతో పాటు రెండు ఖరీదైన కార్లను కూడా ఇచ్చాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తన చిన్ననాటి స్నేహితురాలు సుజానే ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మనస్పర్థలు వచ్చి విడిపోయారు.

Celebrity Divorces
Hrithik Roshan

Also Read: ‘బిందు మాధవి – యాంకర్ శివ’ లకు కలిసిరాని ఆరో వారం !

ఈ సందర్భంగా సుజాన్ ఖాన్ కు హృతిక్ రూ.5 కోట్లను భరణంగా ఇచ్చాడు. అలాగే పిల్లలకు తన ఆస్తిలో వాటా ఉండే విధంగా వీలునామా రాశాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ తో వివాహం సందర్భంగా తన మొదటి భార్య నందినికి రూ.కోటి భరణంగా ఇచ్చాడు. ఇక రెండో భార్యతో ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత విడిపోయాడు. అయితే ఈ సందర్భంగా పిల్లలకు కోట్ల రూపాయల ఆస్తిని రాసి ఇచ్చినట్లు వార్తలు ఉన్నాయి. కానీ వీటిని రేణుదేశాయ్ చాలాసార్లు కొట్టి పారేసినా.. రూమర్లు మాత్రం ఆగట్లేదు. ఇక లేటెస్ట్ గా విడిపోయిన సమంత నాగచైతన్య విషయంలో కూడా ఇలాంటి రూమర్లు వినిపించాయి. కానీ సమంత మాత్రం ఒక్క రూపాయి తీసుకోలేదని చాలాసార్లు ఇండైరెక్ట్ గా చెప్పింది.

Celebrity Divorces
Pawan Kalyan and Renu Desai

Also Read: సితార పాప కూచిపూడి డ్యాన్స్ చూశారా.. మహేష్ ఫ్యాన్స్ కి పండగే..

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular