Celebrity deaths 2023: ఈ సంవత్సరం చనిపోయిన సెలబ్రెటీలు వీరే..

చంద్రమోహన్ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఈయన రీసెంట్ గా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ తుది శ్వాస విడిచారు.

Written By: Neelambaram, Updated On : November 13, 2023 2:42 pm
Follow us on

Celebrity deaths 2023: 2024 సంవత్సరానికి వెల్కమ్ చెప్పి 2023 వ సంవత్సరానికి గుడ్ బాయ్ చెప్పడానికి తక్కువ రోజుల సమయం ఉంది. మరి ఈ ఏడాదిలో హిట్ సినిమాల లిస్ట్ చూస్తే పెద్దగా లేవనే చెప్పాలి. ఆవరేజ్ గా ఆడిన సినిమాల సంఖ్యనే ఎక్కువ. స్టార్ హీరోల సినిమాలు కూడా కొన్ని తుస్ అన్నాయి. మరికొన్ని మాత్రం హిట్ అయ్యాయి. అయితే ఇలా సినిమాలు వస్తున్నాయంటే అభిమాన నటీనటుల కోసం ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. సినిమాలు వస్తున్నాయంటే ఒకే.. కానీ వారు ఇక లేరు అని తెలిస్తే.. అంతకు మించి బాధ పడుతారు కూడా. మరి ఈ సంవత్సరం అభిమానులను శోక సంద్రంలోకి నెట్టి తుదిశ్వాస విడిచిన స్టార్లు ఎవరో ఓ సారి చూసేద్దాం…

చంద్రమోహన్ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఈయన రీసెంట్ గా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. ప్రముఖ టాలీవుడ్ నటుడు, ఎన్టీఆర్ వారసుడు తారకరత్న కూడా ఈ సంవత్సరమే ఫిబ్రవరి నెల 18న మృతి చెందారు. అంతేకాదు ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్, నటుడు, అవార్డ్ గ్రహీత కే. విశ్వనాథ్ కూడా ఫిబ్రవరిలోనే 2వ తేదీనా మరణించారు.

ప్రముఖ టాలీవుడ్ నటి జమున ఈ ఏడాది జనవరి నెల 27వ తేదీన మృతి చెందింది. ఇక శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ గా పేరు సంపాదించారు. అలాంటి శరత్ కుమార్ చనిపోయారు అన్న వార్త అభిమానులను బాధకు గురి చేసింది. ఈయన కూడా మే నెల 22వ తేదీన కన్ను మూశారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో విలన్ గా నటించిన రే స్టీవెన్ కూడా మే 22వ తేదీనా మరణించారు. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్, తమిళ నటుడు మనోబాల, బాలీవుడ్ దర్శకుడు, నటుడు సతీష్ కౌశిక్, తమిళ హాస్య నటుడు మయిల్ స్వామి, ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరామ్ ఈ సంవత్సరమే చనిపోయి అభిమానులను ఏడిపించారు.

డైరెక్టర్ సాగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి, స్టంట్ మాస్టర్ జోడో కేకే రత్నం, పాపులర్ రైటర్ బాల మురుగన్ కూడా ఇదే సంవత్సరం చనిపోయారు. అంతేకాదు కొరియోగ్రఫర్ రాకేష్ మాస్టర్ కూడా ఈ సంవత్సరమే తుది శ్వాస విడిచారు. ఇలా తమ అభిమాన నటీనటులు, డైరెక్టర్ వంటి వారు చనిపోవడంతో అభిమానులు కంటతడి పెడుతున్నారు.