https://oktelugu.com/

జేపీ మృతి తీరని లోటు.. ప్రముఖుల ట్వీట్లు

ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి(జేపీ) మృతిపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టాలీవుడ్లో విలన్ క్యారెక్టర్లకు జయప్రకాశ్ కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గానూ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. అయితే గతంలోనూ ఆయన గుండెకు సంబంధ సమస్యతో చికిత్స చేసుకున్నారు. కాగా నేడు తెల్లవారుజామున ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు గుర్తించి ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతిచెందినట్లు తెలుస్తోంది. Also Read: రిటైర్ మెంట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 8, 2020 / 01:03 PM IST
    Follow us on

    ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి(జేపీ) మృతిపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టాలీవుడ్లో విలన్ క్యారెక్టర్లకు జయప్రకాశ్ కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గానూ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. అయితే గతంలోనూ ఆయన గుండెకు సంబంధ సమస్యతో చికిత్స చేసుకున్నారు. కాగా నేడు తెల్లవారుజామున ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు గుర్తించి ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతిచెందినట్లు తెలుస్తోంది.

    Also Read: రిటైర్ మెంట్ తీసుకున్న జేపీ ఎందుకు వెనక్కొచ్చాడు?

    టాలీవుడ్ ఒక గొప్పనటుడిని కొల్పోవడంపై ప్రముఖులంతా సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేశారు. జేపీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. టాలీవుడ్లో అగ్రనటులతోపాటు ఆయనతో నటించిన సహచర నటీనటులుంతా జేపీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థించారు.

    సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రకాశ్ రాజ్, మాస్ మహారాజ్ రవితేజ, సుధీర్ బాబు, దర్శకుడు అనిల్ రావుపూడి, సంగీత దర్శకుడు తమన్, హీరోయిన్ ప్రణీత, నిర్మాత బండ్ల గణేష్, హీరో గోపీచంద్, శ్రీరామ్ ఆదిత్య, సురేష్ ప్రొడక్షన్స్, యాంకర్ శ్రీముఖి తదితరులంతా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు.

    Also Read: సీమ టపాకాయ్.. నటనలో జేపీ విలక్షణ

    జేపీ మృతి టాలీవుడ్ చిత్రపరిశ్రమని తీరని లోటు.. అద్భుతమైన నటుడిని సినీ పరిశ్రమ కోల్పోయింది.. ఆయన మరణం షాక్ గురి చేసింది.. మీ అద్భుతమైన నటన ఎప్పటికీ గుర్తిండి పోతుంది.. జేపీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అంటూ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖలంతా ట్వీట్లు చేశారు.