Impatience Over ‘Radheshyam’ Ratings: రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా పై కొన్ని చోట్ల బాగా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రతి సినిమా కల్ట్ క్లాసిక్‌లా ఉండాలి అనే తీరుగా విమర్శిస్తున్నారు విమర్శకులు. ఇటీవల విడుదలైన రాధేశ్యామ్ కొంతమందికి బావుండి, మరికొంతమందికి ఫర్వాలేదు అనిపించింది. ప్రభాస్‌లో యాక్షన్ మాత్రమే కోరుకునే వారికి నచ్చలేదు. ఆ వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ క్రిటిక్స్ 1.5, 2 రేటింగ్స్ ఇచ్చారు.

దీంతో.. ఎక్కడైనా విమర్శలు ఇలా ఉంటాయా అని కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇలా ఒక సినిమాని టార్గెట్ చేయడం చాలా దారుణం అంటూ ఆయన సీరియస్ అయ్యాడు. నిజంగా బాలీవుడ్ లో ఈ సినిమా బాగా టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఈ సినిమా మ్యూజిక్ పై కూడా బాగా బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. ఇందులో భాగంగానే ఈ పాన్ ఇండియా మూవీ బాగా స్లో నెరేషన్‌గా ఉందని కామెంట్లు వస్తున్నాయి.
దీనిపై సంగీత దర్శకుడు తమన్ నిన్న స్పందిస్తూ.. ‘స్లో అంట.. నువ్వు పరిగెత్తించాల్సింది’ అంటూ కౌంటర్ వేశాడు. అలాగే తనను ఆకట్టుకున్న మీమ్‌ను పోస్టు చేశాడు. ఇందులో సినిమా చాలా స్లోగా ఉందని అంటే.. లవ్ స్టోరీ అంటే స్లోగా కాకుండా ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ నైట్ సెకండ్ హాఫ్‌లో సెకండ్ సెటప్ పెట్టాలా ఏంటి ? అని ఉంది. మొత్తానికి ‘రాధేశ్యామ్’ బ్యాడ్ టాక్ పై చాలా రకాలుగా మీమ్స్ చేసి వదులుతున్నారు గాసిప్ రాయుళ్లు.
మరోపక్క ఇప్పటికే ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున సినిమా పై తమ ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు. చిరంజీవి కూడా తన ఫ్యామిలీతో ‘రాధేశ్యామ్’ సినిమాను వీక్షించారు. అనంతరం తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. ‘రాధేశ్యామ్’ తిరుగులేని విజయం అందుకున్నందుకు నా హృదయపూర్వక అభినందనలు.