Hero Nithin: యంగ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. తనదైన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం నితిన్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడని చెప్పాలి. ఒకదాని తరువాత మరొక సినిమా చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు నితిన్. ఇటీవల ‘మ్యాస్ట్రో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ మంచి విజయన్నే దక్కించుకున్నాడు. నితిన్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’.
పూరి జగన్నాథ్ దగ్గర పని చేసిన ఎస్‌ఆర్ శేఖర్ ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. శ్రేష్ఠ మూవీస్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇందులో నితిన్‌కు జోడీగా కృతిశెట్టి కనిపించనుంది. తాజాగా కేథరిన్ థెరిస్సాను మరో హీరోయిన్ నటించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ ను విడుదల చేశారు. నితిన్ గత చిత్రాలకు భిన్నంగా ఫుల్ మాస్ రోల్ లో కనిపించనున్నారు. కేథరిన్, నితిన్ కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. ‘భీష్మ’, ‘మాస్ట్రో’ వంటి చిత్రాల తరువాత మూడోసారి మహతి స్వరసాగర్ తో కలిసి నితిన్ పని చేస్తున్నారు. గత కొంతకాలంగా తెలుగులో కేథరిన్ కు అవకాశాలు తగ్గాయని చెప్పొచ్చు. ఈ మూవీ తో అయిన కేథరిన్ ఫామ్ లోకి రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
Welcoming the Dazzling Actress @CatherineTresa1 on-board to #MacherlaNiyojakavargam 😍
In Cinemas Worldwide from April 29th, 2022! 🚩@actor_nithiin @IamKrithiShetty @SrSekkhar @mahathi_sagar #SudhakarReddy #NikithaReddy #RajkumarAkella @SreshthMovies pic.twitter.com/tkTvDHPlyQ
— Sreshth Movies (@SreshthMovies) November 16, 2021
కాగా ఈ చిత్రంలో ప్రసాద్ మూరెళ్ల కెమెరామెన్ గా, మామిడాల తిరుపతి మాటల రచయితగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నామని మూవీ మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.