https://oktelugu.com/

Pushpa Item Song: ఐదు నిమిషాల ‘పుష్ప’ పాటకు సమంతకు అన్ని కోట్లా?

Pushpa Item Song: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘పుష్ప’. ఈ సినిమా పూర్తి కావస్తోంది. చివరి ఐటెం సాంగ్ ఒకటి మిగిలిపోయిందట.. ఈ నేపథ్యంలోనే ఆ పాట కోసం తమన్నా, పూజా హెగ్డే లాంటి టాప్ హీరోయిన్లను అడిగారట.. ఐటెం సాంగ్ లో డ్యాన్స్ చేయాలని కోరారట.. కానీ ఈ విషయం తెలుసుకున్న సమంత తనే స్వయంగా అల్లు అర్జున్ కు ఫోన్ చేసి తనకు ఛాన్స్ ఇవ్వమని అడిగిందట..దీనికి బన్నీ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2021 / 05:15 PM IST
    Follow us on

    Pushpa Item Song: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘పుష్ప’. ఈ సినిమా పూర్తి కావస్తోంది. చివరి ఐటెం సాంగ్ ఒకటి మిగిలిపోయిందట.. ఈ నేపథ్యంలోనే ఆ పాట కోసం తమన్నా, పూజా హెగ్డే లాంటి టాప్ హీరోయిన్లను అడిగారట.. ఐటెం సాంగ్ లో డ్యాన్స్ చేయాలని కోరారట.. కానీ ఈ విషయం తెలుసుకున్న సమంత తనే స్వయంగా అల్లు అర్జున్ కు ఫోన్ చేసి తనకు ఛాన్స్ ఇవ్వమని అడిగిందట..దీనికి బన్నీ ఓకే చెప్పడం.. సుకుమార్ ను ఒప్పించడం చకచకా జరిగిపోయాయి.

    samantha

    గతంలో ఎన్నడూ లేని విధంగా సమంత ఈ స్పెషల్ సాంగ్ లో నటించేందుకు ఓకే చెప్పింది. పుష్ప ఐటెం సాంగ్ లో సమంత నటిస్తోంది. తాజాగా ఈ విషయాన్ని చిత్రం యూనిట్ కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ఈనెల 26 నుంచి ప్రారంభం కానుంది. కేవలం 4 రోజుల్లోనే ఈ పాట షూటింగ్ పూర్తి చేయనున్నారు.

    అయితే ఈ ఐటెం సాంగ్ కోసం సమంత భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం 5 నిమిషాల నిడివి ఉన్న పాటలో నటించేందుకు సమంత రూ. కోటిన్నర తీసుకోనున్నట్టు సమాచారం. ఈ పాట సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని భావిస్తున్న చిత్రం యూనిట్.. సమంత డిమాండ్ చేసినంత ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

    సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్ అదిరిపోయేలా ఉంటుంది. ప్రతీ సినిమాలోనూ పెడుతుంటాడు. ‘రంగస్థలం’లోనూ ‘జిగేల్ రాణి’ పాటలో పూజాహెగ్డే నటించింది.అ ది పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు సమంత సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి మరీ.

    మరి ఈ వార్తలు నిజమా? సమంతకు కోటిన్నర ఇచ్చి ఐటెం సాంగ్ తీస్తున్నారా? అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచిచూడాల్సిందే.

    https://twitter.com/MythriOfficial/status/1460224339840671744?s=20