Homeఎంటర్టైన్మెంట్MAA Election 2021: ప్చ్.. ఈ కులాల కుంపట్లే తెలుగుదనమా ?

MAA Election 2021: ప్చ్.. ఈ కులాల కుంపట్లే తెలుగుదనమా ?

MAA Election 2021
Prakash Raj with Chiranjeevi

MAA Election 2021: మెగాస్టార్ చిరంజీవి చాలా నెమ్మదస్తుడు. ఆవేశం, కోపం వచ్చినా బయటకు వ్యక్తపరచడానికి కూడా ఇష్టపడదు. ఇప్పుడు ఇదే ఆయనకు పెద్ద సమస్య అయిపోయింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవిని ముందుగా ప్రకాష్ రాజ్ కలిశాడు. దాంతో చిరు ఆయనకు మద్దతు ఇస్తాం అని మాట ఇచ్చాడు. ఇక్కడే సమస్య మొదలైంది.

చిరు మాట ఇచ్చాడు గానీ, మంచు విష్ణును ఆపలేకపోయాడు. దాంతో, ఇక మా ఎన్నికల్లో చిరు నేరుగా జోక్యం చేసుకోవడానికి ఇష్టపడలేదు. ప్రకాష్ రాజ్ తో కూడా మా కుటుంబానికి సంబంధించిన ఓట్లు అన్నీ నీకే పడతాయి అని మాట ఇచ్చి, తన సినిమా బిజీలో తానూ ఉన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ఎవరికైనా మద్దతిస్తున్నారా ? అంటే అది కూడా క్లారిటీ లేదు.

పవన్, కేవలం ప్రకాష్ రాజ్ లోకల్, నాన్ లోకల్ విషయం గురించే మాట్లాడాడు. అలాగే, మొదట్లో ప్రకాష్ రాజ్ గురించి నాలుగు మంచి మాటలు చెప్పిన నాగబాబు సైతం, ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు. మొత్తానికి మెగా ఫ్యామిలీ మా ఎలెక్షన్స్ కి దూరంగానే ఉంది. అలాగే ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులకు కూడా దూరంగానే ఉన్నారు.

వాళ్ళు కలవడానికి ఎన్ని సార్లు ప్రయత్నాలు చేసినా.. చిరు అపాయింట్ మెంట్ ఇవ్వడానికి కూడా ఆసక్తి చూపించలేదు. వివాదానికి ఇంత దూరంగా ఉన్న మెగా కాంపౌండ్‌ ను, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవినీ ఈ ‘మా’ వ్యవహారంలోకి ఇంకా లాగుతూనే ఉన్నారు. దీనికి మా ఎన్నికల్లో ‘కాపు’ వర్సెస్ ‘కమ్మ’ అనే దిక్కుమాలిన కుల జబ్బు తాలూకు ప్రస్తావన తీసుకొచ్చి అడ్డమైన కామెంట్స్ కి పునాది వేస్తున్నారు.

అయినా ప్రకాష్ రాజ్ కులం కాపు కాదు కదా ? మరెందుకు ఈ కులం రొచ్చులోకి మా ఎన్నికలను తీసుకువెళ్తున్నారు ? ఒక్కటి మాత్రం నిజం.. సినీ పరిశ్రమలో కమ్మ కులానికి చెందిన కొందరికి ‘అభద్రతాభావం’ కారణంగానే ఈ కులాల కుంపట్లు మా ఎన్నికల్లో చొరబడ్డాయి. అయితే, కులం ఒక్కటే ఉంటే ఏం బాగుంటుంది అనుకున్నారేమో.. ‘మా’ ఎన్నికల్లో (MAA Elections 2021) మతం ఎజెండాను కూడా తీసుకొచ్చారు.

అన్నిటికీ కంటే ముందు తెలుగుదనం ఎజెండా తీసుకొచ్చారు. ఇప్పటికే మనం తెలుగు వాళ్ళం మన తెలుగుదనం అంటూ ప్రకాష్ రాజ్ పై ప్రాంతీయ ద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారు. మరి ఇన్నాళ్లు ఈ తెలుగుదనం మహానుభావులు ఏమైపోయారు ? ఇంతకీ ఇలాంటి తక్కువ బావాలు ఉన్న వారి వల్ల సినీ పరిశ్రమకు మేలు జరుగుతుందని ఎలా నమ్మగలం ? అయినా ఈ కులాల కుంపట్లనే తెలుగుదనం అనుకోవాలా ?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version