https://oktelugu.com/

Case File on Chinmayi: మరో వివాదంలో సింగర్ చిన్మయి, పోలీస్ స్టేషన్ లో కేసు, క్షమాపణలు డిమాండ్, అసలు మేటర్ ఏంటంటే?

ప్రతిసారి ఎదుటివాళ్లదే తప్పు అని అనుకోకూడదు మన వైపు కూడా తప్పు ఉండొచ్చు అంటూ ఆమె తన అభిప్రాయం తెలిపారు. కాగా సింగర్ చిన్మయిణ అన్నపూర్ణ మాటల పై సెటైర్లు వేసింది.

Written By:
  • S Reddy
  • , Updated On : March 1, 2024 / 11:01 AM IST
    Follow us on

    Case File on Chinmayi: సీనియర్ నటి అన్నపూర్ణ(Actress Annapurna) ఓ ఇంటర్వ్యూలో ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి మాట్లాడింది. ఈ క్రమంలో ఆమె ఆడవాళ్లకు స్వేచ్ఛ ఎందుకు .. అర్ధరాత్రి వరకు బయట తిరగాల్సిన పని ఏముంది .. ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎలా ఉంటున్నారు. పైగా ఈ రోజుల్లో ఎక్స్ పోజింగ్ ఎక్కువైంది. ప్రతిసారి ఎదుటివాళ్లదే తప్పు అని అనుకోకూడదు మన వైపు కూడా తప్పు ఉండొచ్చు అంటూ ఆమె తన అభిప్రాయం తెలిపారు. కాగా సింగర్ చిన్మయి(Singer Chinmayi) అన్నపూర్ణ మాటల పై సెటైర్లు వేసింది.

    అన్నపూర్ణ కామెంట్స్ ఖండిస్తూ చిన్మయి .. ఆమె చెప్పిన దాని ప్రకారం లేడీ డాక్టర్లు రాత్రి పని చేయకూడదు. ఎమర్జెన్సీ వచ్చినా ఉదయం వరకు వెయిట్ చేసి .. పొద్దునే హాస్పిటల్ కి వెళ్ళాలి. వేష ధారణ వల్లే అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటున్నారు. భారతదేశంలో పుట్టడం మన ఖర్మ అంటూ కౌంటర్లు వేసింది. ఈ వీడియో పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

    ఆమె ఒక విధంగా మాట్లాడితే .. దాన్ని ఇలా మార్చి ఎందుకు మాట్లాడుతున్నావు. ఎమర్జెన్సీ సర్వీసుల గురించి ఆమె మాట్లాడలేదు. అర్ధరాత్రి రోడ్లపై తాగుతూ తిరుగుతూ ఎంజాయ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడింది. ఫ్రీడమ్ ని మిస్ యూజ్ చెయ్యొద్దు అని ఆమె మాట్లాడింది. కానీ నువ్వు విషయాన్ని మార్చి ఏదో చెప్తున్నావ్. ఓవర్ చేయకు అంటూ నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు.

    కాగా ఈ దేశంలో అమ్మాయిగా పుట్టడం మన ఖర్మ అంటూ చిన్మయి చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు చిన్మయిపై కేసు పెట్టారు. మహిళలకు మన దేశంలో ఎంతో సముచిత స్థానం ఉంది. అయినా దేశాన్ని, మహిళలను కించపరిచే విధంగా చిన్మయి కామెంట్స్ ఉన్నాయని వారు ఫైర్ అయ్యారు. చిన్మయి వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఆడవారికి సపోర్ట్ చేస్తూ ఆమె పెట్టే సోషల్ మీడియా పోస్ట్స్ ట్రోలింగ్ కి గురవుతుంటాయి. కరుడుగట్టిన ఫెమినిస్ట్ అంటూ కొందరు చిన్మయి పై విమర్శలు చేస్తూ ఉంటారు.