Bro Movie Climax: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’ ఈ నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా కొద్దిరోజుల క్రితమే విడుదల చేసిన టీజర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలోని మొదటి పాట ‘మై డియర్ మార్కండేయ’ ఈ వారం లోనే విడుదల కాబోతుంది.
ఈ పాట పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఉంటుందట. ఈ సాంగ్ అద్భుతంగా వచ్చినట్టు చెప్తున్నారు.పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత నుండి ఆయన చేసిన మూడు సినిమాలకు సంగీత దర్శకుడిగా థమన్ పని చేసాడు. అందులో వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ సినిమాలకు ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఆ రెండు సినిమాలను మరో లెవెల్ కి తీసుకెళ్లాయి. ఈ బ్రో చిత్రానికి కూడా ఆ రేంజ్ బ్యాక్ గ్రౌండ్ మరియు పాటలను అందించాడట థమన్.
ఇక పోతే ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అదేమిటంటే ఈ సినిమాలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో, అదే రేంజ్ లో సెంటిమెంట్ మరియు ఎమోషన్స్ కూడా ఉంటాయట. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ఆడియన్స్ చేత కన్నీళ్లు పెట్టించే రేంజ్ లో ఉంటుందట. పవన్ కళ్యాణ్ సినిమాకి చాలా కాలం తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ క్యూలు కట్టే సమయం వచ్చేసిందని, ఇది ఆ రేంజ్ కంటెంట్ ఉన్న సినిమా అని అంటున్నారు.
ఒక్కసారి ఫ్యామిలీ ఆడియన్స్ ఒక సినిమాని మాది అని ఓన్ చేసుకుంటే బాక్స్ ఆఫీస్ వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బ్రో సినిమా కూడా ఆ రేంజ్ లో వసూళ్లు రాబడుతుంది అని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి కనులపండుగ లాగా ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఈ చిత్రం చెప్పిన విధంగా ఉంటుందా లేదా అనేది.