https://oktelugu.com/

SS Rajamouli: మహేష్ తో నేను అలాంటి రిస్క్ చెయ్యలేను

SS Rajamouli: #RRR సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యం లో సాగే ఈ సినిమా స్క్రిప్ట్ ఇంకా మొదలు కానప్పటికీ వచ్చే ఏడాది సమ్మర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాము అని రాజమౌళి ఇటీవల జరిగిన కొన్ని ఇంటర్వూస్ లో తెలిపాడు..ఇప్పటికే యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యం లో రెండు స్టోరీ లైన్లు అనుకున్నాము అని..అవి ఇటీవలే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 17, 2022 / 05:49 PM IST
    Follow us on

    SS Rajamouli: #RRR సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యం లో సాగే ఈ సినిమా స్క్రిప్ట్ ఇంకా మొదలు కానప్పటికీ వచ్చే ఏడాది సమ్మర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాము అని రాజమౌళి ఇటీవల జరిగిన కొన్ని ఇంటర్వూస్ లో తెలిపాడు..ఇప్పటికే యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యం లో రెండు స్టోరీ లైన్లు అనుకున్నాము అని..అవి ఇటీవలే మహేష్ ని కలిసి వివరించగా ఆయనకీ ఎంతో అద్భుతంగా అనిపించాయి అని..రెండిట్లో ఏ స్టోరీ లైన్ తీసుకున్నా నాకు పర్లేదు అని మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని..త్వరలోనే వీటిని డెవలప్ చేసి ఎదో ఒక్క స్టోరీలైన్ ని ఫిక్స్ చేసి స్క్రిప్ట్ ని రాయడం ప్రారంభిస్తాము అని స్వయంగా రాజమౌళి ఒక్క ఇంటర్వ్యూ లో తెలిపాడు..ఈ ఏడాది చివరి లోగ స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసి వచ్చే ఏడాది నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాడు అట రాజమౌళి.

    SS Rajamouli

    ఫిలిం నగర్ నుండి లేటెస్ట్ గా అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ని ఆయన గత రెండు సినిమాలు లాగ కాకుండా తక్కువ బడ్జెట్ తో పూర్తి చెయ్యాలని అనుకుంటున్నాడు అట..రాజమౌళి సినిమా అనగానే మనకి అద్భుతమైన VFX షాట్స్ తో గ్రాండియర్ గా తీసే సినిమాలే మనకి గుర్తుకు వస్తాయి..కానీ మహేష్ తో తియ్యబోయ్యే సినిమా ఈసారి అలా కాకుండా ఛత్రపతి , వికమార్కుడు మరియు సింహాద్రి తరహా సినిమాలు లాగా రెగ్యులర్ కమర్షియల్ చిత్రంగా తెరకెక్కించబోతున్నాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇప్పటి వరుకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యం లో వచ్చిన సినిమాలు ఏమి లేవు కనుక..మహేష్ తో తియ్యబోయ్యే ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ని కనివిని ఎరుగని రేంజ్ లో ఊహించని ట్విస్టులతో సినిమాని మొత్తం నింపేయబోతున్నాడు అట రాజమౌళి..మరి ఇండస్ట్రీ మొత్తం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఈ సెన్సషనల్ కాంబినేషన్ ఎలాంటి వండర్స్ ని సృష్టించబోతుందో చూడాలి.

    Also Read: Bandi sanjay- Aravind: ఎమ్మెల్యే సీటుపైనే సంజ‌య్‌, అర‌వింద్ ఆశ‌లు.. ఇవ‌న్నీ అడ్డంకులే..!

    SS Rajamouli

    రాజమౌళి సినిమా ప్రారంభం కావడానికి ఇంకా చాలా సమయం ఉండడం తో ఈలోపు మహేష్ బాబు రెండు సినిమాలు పూర్తి చేసి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యాడట..ఇప్పటికే ఆయన డైరెక్టర్ పరశురామ్ పెట్ల తో సర్కారు వారి పాట సినిమా చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..షూటింగ్ కార్యక్రమాలు అన్ని దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెల 12 వ తారీఖున ప్రేక్షకుల ముందుకి రాబోతుంది..ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు..ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకోబోతుంది..ఖలేజా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని త్రివిక్రమ్ తో చేస్తున్న మహేష్ సినిమా కావడం తో ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి..ఇక ఈ సినిమా తో పాటు ఆయన మరో సినిమా కూడా ఓకే చేసే ఆలోచన లో ఉన్నాడట మహేష్..అలా రాజమౌళి సినిమా ప్రారంభం అయ్యేలోపు మహేష్ బాబు 3 కోట్ల సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు అన్నమాట.

    Also Read:Prashanth Neel: KGF Chapter 3 స్టోరీ ఇదే

    Tags