Megastar Chiranjeevi: చాలా కాలం నుండి మెగా ఫ్యామిలీ తో పాటుగా మెగా అభిమానులు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రామ్ చరణ్ – ఉపాసన మొదటి సంతానం ఈ భూమి మీదకి వచ్చేసింది. ఈరోజు తెల్లవారు జామున 1 గంటకి ఒక ఆడబిడ్డకు జన్మని ఇచ్చారు. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ లో ఎంత ఆనందం ఉంది ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక మెగా స్టార్ చిరంజీవి కూడా తన కొడుకు తండ్రి అయ్యినందుకు ఎంతో సంతోషించాడు.
ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ ’11 ఏళ్ళ నుండి నా బిడ్డ రామ్ చరణ్ తండ్రి అయ్యి నా చేతిలో బిడ్డని ఎపుడు పెడుతాడా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు వాడికి పుట్టిన ఈ ఆడబిడ్డ మాకు ఎంతో అపురూపం, ఈ సందర్భంగా మా సంతోషమే తమ సంతోషంగా భావించే అభిమానులకు, బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలియచేసినందుకు ధన్యవాదాలు’ అంటూ మెగాస్టార్ చిరంజీవి కాసేపటి క్రితమే మీడియా ముందుకొచ్చి మాట్లాడాడు.
ఇది ఇలా ఉండగా ఉపాసన కి నార్మల్ డెలివరీ అయ్యిందా, లేదా సిజేరియన్ చేసారా అనేది ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద చర్చగా మారింది. ఇదే విషయాన్నీ చిరంజీవి ని అడగగా ‘ఉపాసనకు సిజేరియన్ చెయ్యాల్సిన అవసరం రాలేదు, చాలా మామూలుగా డెలివరీ అయిపోయింది. మేము సిజేరియన్ అవసరం ఉంటుందేమో అనుకొని ప్రఖ్యాత డాక్టర్లను పిలిపించాము, కానీ అంత కంప్లికేటడ్ డెలివరీ అయితే అవ్వలేదు. చాలా సుఖవంతమైన ప్రసవం అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి.
ఇక రామ్ చరణ్ నుండి ఒక్క ట్వీట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆయనకీ పుట్టిన కూతురు ఫోటోలు అప్లోడ్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే కాసేపటి క్రితం నుండి సోషల్ మీడియా లో రామ్ చరణ్ కూతురు ఈమె అంటూ ఒక ఫోటో తెగ ప్రచారం అవుతుంది, అది నిజమో కాదో రామ్ చరణ్ ట్వీట్ వేసేవరకు ఎవరికీ తెలియదు.