Viral Photo : ఈ ఫొటోలో రౌండ్ మార్క్ చేసున్న బుడ్డోడు ఎవరో గుర్తు పట్టారా..?, ఇతను ఒక టాప్ డైరెక్టర్ కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. పేరుకే ఇతగాడు మలయాళం ఇండస్ట్రీ కి సంబంధించిన హీరో. కానీ అన్ని ఇండస్ట్రీలకు బాగా కావాల్సినవాడు. సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకడిగా మారిపోయాడు. కేవలం హీరో పాత్రలను మాత్రమే కాదు, నటనకు ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్రలో నటించడానికైనా సిద్దపడే డేరింగ్ నటుడిగా, విలక్షణ నటుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. తెలుగు లో ఇప్పటి వరకు ఈయన చేసింది కేవలం రెండు సినిమాలే. కానీ ఫ్యాన్స్ ని మాత్రం లక్షల్లో సంపాదించుకున్నాడు. తమిళం లో కమల్ హాసన్, రజినీకాంత్ వంటి సూపర్ స్టార్స్ సినిమాల్లో నటించే అదృష్టం దక్కించుకున్న నటుడు. కేవలం నటించడమే కాదు, ఆ పాత్రలు చిరకాలం గుర్తించుకునేలా చేసాడు. ఇంతకీ ఆ నటుడు మరెవరో కాదు ఫహాద్ ఫాజిల్.
ఈయన మన టాలీవుడ్ కి ‘పుష్ప’ చిత్రం ద్వారా పరిచయమయ్యాడు. ఇప్పుడు ‘పుష్ప 2’ చిత్రం ద్వారా మరోసారి ఆయన తెలుగు ఆడియన్స్ ని పలకరించాడు. అతి త్వరలోనే ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకోనుంది. ఇదంతా పక్కన పెడితే ఫహద్ ఫాజిల్ మలయాళం లో పెద్ద స్టార్ హీరో. ఈయన ప్రముఖ మలయాళం సినీ దర్శకుడు ఫాజిల్ కి కుమారుడు. బాలనటుడిగా పలు మలయాళం సినిమాల్లో నటించిన ఈయన, 2002 వ సంవత్సరం లో ‘ఖైతుం దూరత్’ అనే మలయాళం సినిమా ద్వారా హీరో గా వెండితెర అరంగేట్రం చేసాడు. ఈ సినిమాలో ఫహద్ నటన, డ్యాన్స్, ఫైట్స్ వంటివి చూసి అప్పట్లో ఒక రేంజ్ లో ట్రోలింగ్ నడిచిందట. దీంతో ఆయన 7 ఏళ్ళ పాటు సినిమాలకు దూరంగా జరిగి వ్యాపార రంగం లో రాణించాడు.
ఆ తర్వాత 2009 వ సంవత్సరంలో ‘కేరళ కేఫ్’ అనే చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మమ్మూటీ హీరో గా నటించిన ‘ప్రమని’ అనే చిత్రంలో కీలక పాత్ర పోషించి మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఈ చిత్రం లో ఫహద్ సతీమణి నజ్రియా నజీమ్ కూడా ఒక హీరోయిన్ గా నటించింది. అలా మొదలైన ఫహద్ కెరీర్ ఎన్నో మలుపులు తిప్పుకుంటూ ఇక్కడి వరకు వచ్చింది. ఈ ప్రయాణం లో ఆయనకీ ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి. ఫిలిం ఫేర్, నేషనల్ అవార్డు, కేరళ స్టేట్ అవార్డు ఇలా ఒక్కటా రెండా ఎన్నో అవార్డులు ఆయన ప్రతిభకు తార్కాణంగా నిలిచాయి. కేవలం నటుడిగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా ఈయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈయన చేతిలో ఒక తెలుగు సినిమా, ఒక తమిళ సినిమా, రెండు మలయాళం సినిమాలు ఉన్నాయి.