Heroine : ముఖ్యంగా సినిమా తారలకు సంబంధించిన పాత విషయాలు కూడా నెట్టింట వినిపిస్తున్నాయి. ఇక సామాజిక మాధ్యమాలలో హీరో హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలకు అయితే కొదవే ఉండదు అని చెప్పొచ్చు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరో హీరోయిన్లకు సంబంధించిన పాత ఫోటోలు కానీ రేర్ ఫోటోలు కానీ నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. హీరోయిన్లు తమ అందంతో గ్లామర్ తో సినిమాలలో ప్రేక్షకులను కవ్విస్తూ ఉంటారు. రోజురోజుకు వాళ్ళు తమ గ్లామర్ను మరింత పెంచుకుంటూ అవకాశాలు అందుకుంటూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే. వాళ్లలో అప్పటికి ఇప్పటికీ కూడా ఇంత మార్పు వచ్చిందా అంటూ అందరూ నోరెళ్ల పెట్టాల్సిందే. చిన్నప్పుడు బిలో ఆవరేజ్ గా ఉన్న చాలామంది హీరోయిన్లు ప్రస్తుతం ఎక్స్ట్రా ఆర్డినరీ అందంతో ప్రేక్షకులను మాయ చేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా.
Also Read : రెండు సినిమాలలో ఒకటి ఫ్లాప్.. మరొకటి భారీ హీట్.. కానీ అవకాశాలు అందుకోలేకపోతున్న హాట్ బ్యూటీ
ప్రస్తుతం ఈమె సినిమా ఇండస్ట్రీలో తన అందంతో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. చాలా క్యూట్ గా అందంగా ఉండే ఈ చిన్నది ఎవరో కాదు బ్రిగడా సాగా. సోషల్ మీడియాతో బ్రిగ్గిడా సాగా విపరీతమైన క్రేజీ తెచ్చుకుంది. ఈమె గురించి సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. బుల్లితెర మీద నుంచి బ్రిగిడ సాగ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. హీరో విశాల్ నటించిన అయోగ్య సినిమాతో ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది.ఇరవిన్ నిజాల్ అనే సినిమాలో కూడా ఈ చిన్నది నటించింది. ఈ సినిమాలో ఆమె నగ్నంగా నటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ సినిమాలో చిలకమ్మా అనే పాత్రతో ఆమె బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కుర్రాళ్ళ ఫేవరెట్ హీరోయిన్. చూడడానికి చాలా అందంగా చూడముచ్చటగా ఉన్న ఈ చిన్నది తన అందంతో అందరిని కట్టిపడేస్తూ ఉంటుంది.
సింధూరం అనే సినిమాతో ఈమె తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే బ్రిగిడ సాగ తన ఫోటోషూట్లతో నిత్యం అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లలో ఈమెకు విపరీతమైన మరియు ఫాలోయింగ్ ఉన్నాయి. అయితే బ్రిగిడ సాగ చిన్ననాటి ఫోటో చూసి ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. చిన్నప్పుడు చాలా సాదాసీదాగా ఉన్నా బ్రిగీడా సాగా ప్రస్తుతం చాలా అందంగా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.