OG Movie vs Raja Saab: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. సినిమా విడుదలై దాదాపుగా నెల రోజులు దాటింది. అభిమానులు ఇంకా ఈ చిత్రం మత్తు నుండి బయటకు రాలేదు. ప్రపంచవ్యాప్తంగా 330 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి వచ్చింది. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమాలోని సన్నివేశాలకు సంబంధించిన కొన్ని షాట్స్ కనిపిస్తున్నాయి. థియేటర్స్ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో, ఓటీటీ లో అంతకు మించి హిట్ అయ్యేలా కనిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఓపెనింగ్ వసూళ్లను అందుకునే సత్తా రాబోయే పాన్ ఇండియన్ సినిమాల్లో ఏ చిత్రానికి ఉంది అనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ.
ఈ చిత్రం తర్వాత విడుదల అవ్వబోతున్న స్టార్ హీరో సినిమా ఏదైనా ఉందా అంటే అది రాజ్ సాబ్(Raja Saab Movie) నే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా ‘ఓజీ’ తెలుగు రాష్ట్రాల్లోని ఓజీ మూవీ ఓపెనింగ్స్ ని అందుకుంటుందా లేదా? అనే చర్చ సోషల్ మీడియా లో విస్తృతంగా జరుగుతుంది. ఓజీ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 64 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. #RRR తర్వాత ఆ రేంజ్ లో షేర్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం టాప్ 2 గా నిల్చింది ఈ చిత్రం. ఇక వర్త్ షేర్ విషయానికి వస్తే #RRR చిత్రానికి 57 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓజీ చిత్రానికి 55 కోట్ల రూపాయిల వర్త్ షేర్ వచ్చింది.
ఈ రికార్డు ని అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. ప్రీమియర్ షోస్ నుండే రికార్డ్స్ ని నెలకొల్పాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఓజీ చిత్రానికి కేవలం ప్రీమియర్ షోస్ నుండి 20 కోట్ల రూపాయిల షేర్ రాబట్టి ఆల్ టైం రికార్డుని నెలకొల్పింది. ‘రాజా సాబ్’ చిత్రానికి కూడా ఇదే రేంజ్ వసూళ్లు వస్తాయని ప్రభాస్ ఫ్యాన్స్ బలమైన నమ్మకంతో ఉన్నారు. తెలంగాణ ప్రాంతం లో చాలా తేలికగా ఓజీ చిత్రానికి దగ్గరగా రావొచ్చు, కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం కాస్త కష్టమే. కానీ సందీప్ వంగ తో చెయ్యబోయే స్పిరిట్ చిత్రం మాత్రం ‘ఓజీ’ తెలుగు రాష్ట్రాల రికార్డు ని కచ్చితంగా బద్దలు కొడుతుందని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది.