https://oktelugu.com/

Chiranjeevi : చిరంజీవి శ్రీకాంత్ ఓదెల మూవీ కి నాని 200 కోట్లు పెట్టగలడా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : January 7, 2025 / 01:43 PM IST

    Chiranjeevi

    Follow us on

    Chiranjeevi : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇదిలా ఉంటే స్టార్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి నటులు ఇప్పటికే వాళ్ళ స్టార్ డమ్ ను పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు… వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరు వాళ్ళ ఎంటైర్ కెరియర్ లో ఒక్కసారైనా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని అనుకుంటారు. కానీ కొందరికి మాత్రమే అలాంటి అవకాశం అయితే దక్కుతుంది. మిగతా వాళ్ళకి అవకాశం దక్కకపోవచ్చు. ఎందుకంటే చిరంజీవి ఇప్పుడు ఆచితూచి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా వరకు కేర్ ఫుల్ గా ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ‘దసర ‘ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ సినిమాకి నాని ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాని మొదట 100 కోట్ల బడ్జెట్ లో కంప్లీట్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ దాదాపు 200 కోట్ల వరకు అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి నాని ప్రొడ్యూసర్ గా ఉన్నప్పటికి తను కేవలం 100 కోట్లు వరకు మాత్రమే అయితే సినిమాని ప్రొడ్యూస్ చేయగలనని అనుకున్నాడట.

    సినిమా అయ్యే ఇంకో వంద కోట్ల పరిస్థితి ఎలా అంటూ ఒక డైలమాలో అయితే నాని ఉన్నారట. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం శ్రీకాంత్ ఓదెల జోక్యం చేసుకొని ఎక్కడో అక్కడ డబ్బులు తీసుకొచ్చి పెట్టండి సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది. ఆ తర్వాత మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయని నానికి ధైర్యం చెబుతున్నట్టుగా తెలుస్తోంది.

    మరి ఏది ఏమైనా కూడా నాని దగ్గర అంత భారీ మొత్తంలో అమౌంట్ ఉందా? మరి ఆయన ఈ సినిమాని ఫుల్ గా ప్రొడ్యూస్ చేయగలడా లేదంటే మరొక ప్రొడ్యూసర్ సహాయం తీసుకోబోతున్నాడా? అనే వార్తలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి… ఇక ఈ సినిమా కోసం చిరంజీవి దాదాపు 75 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

    మరి ఏది ఏమైనా కూడా మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కూడా తన స్టామినా ఏంటో చూపిస్తూ భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ ని తీసుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక వాల్తేరు వీరయ్య సినిమాతో 200 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టాడు. కాబట్టి చిరంజీవికి 200 కోట్లకు పైన మార్కెట్ అయితే ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…