https://oktelugu.com/

Mahesh Babu and Rajamouli : మహేష్ బాబు మూవీ పూజ కార్యక్రమాలను ఓటిటి లో రిలీజ్ చేస్తున్నారా.?రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదుగా…

ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళను వాళ్ళు స్టార్లు గా ఎలివేట్ చేసుకుంటు ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. రాజమౌళి లాంటి దర్శకుడు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ ని పాన్ ఇండియాలో ఎలివేట్ చేశాడు. అలాగే ఇప్పుడు పాన్ వరల్డ్ స్థాయికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : January 7, 2025 / 01:49 PM IST

    Mahesh Babu , Rajamouli

    Follow us on

    Mahesh Babu and Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి…ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలతో మంచి విజయాలను అందుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన మహేష్ బాబుతో భారీ సినిమాని చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ని కూడా రాజమౌళి ప్రస్తుతానికైతే బయటకి తెలియజేయడం లేదు. పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా తొందర్లోనే సెట్స్ మీదకి వెల్లబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి…ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తం కార్యక్రమాలను నిర్వహించిన వాళ్ళు మీడియా వాళ్ళను లోపలికి లో చేయలేదు. అలాగే ఒక్క వీడియోని గాని ఫోటోని కూడా రివిల్ చేయడానికి రాజమౌళి చేయలేదు. కారణం ఏంటి అంటే రాజమౌళి పూజా కార్యక్రమాలను కూడా డాక్యుమెంటరీ రూపంలో ఓటిటి ప్లాట్ఫారం మీద రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. నిజానికి రాజమౌళి తను చేయబోతున్న సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతూ ఉంటాయి. ఆ బడ్జెట్ ను రికవరీ చేయడానికి తను ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.

    ఇక ఏదో ఒక రకంగా ఆ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లి దానిమీద పబ్లిసిటీ రప్పించడమే కాకుండా సినిమాకి పెట్టిన బడ్జెట్ కి డబుల్ కలెక్షన్స్ ని వచ్చే విధంగా ఆయన తెరకెక్కిస్తూ ఉంటాడు. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్లు గాని హీరోలు గాని చాలా ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

    మరి ఇప్పుడు కూడా తను బిజినెస్ స్ట్రాటజీ లోనే ఆలోచిస్తూ మహేష్ బాబు సినిమాకి సంబంధించిన ఒక్క వీడియోని గాని, ఫోటోలు గాని బయటికి రిలీజ్ అయితే చేయడం లేదు. ఇక ప్రతి విషయాన్ని బిజినెస్ యాంగిల్ లోనే ఆలోచిస్తూ ముందుకు సాగుతున్న రాజమౌళి ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా భారీ రికార్డులను సృష్టించాలని చూస్తున్నాడు.

    తను అనుకున్నట్టుగానే రాబోయే సినిమాలతో ఎలాంటి విజువల్ వండర్స్ ని క్రియేట్ చేస్తాడు తద్వారా ఆ సినిమాలు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాయి అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటికి రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలు భారీ విజయాలను అందుకొని తెలుగు సినిమా స్థాయిని నిలబెట్టాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా హాలీవుడ్ లో కూడా తెలుగు సినిమాల స్థాయిని పెంచబోతున్నట్టుగా తెలుస్తోంది…