Cable Wires Cut In Hyderabad: శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా జరిగిన శోభాయాత్రలో అపశృతి నెలకుంది. విద్యుత్ తీగలు తగిలి పలువురు ప్రాణాలు పోయాయి. అయితే ఈ సంఘటనకు విద్యుత్ స్తంభాలపై ఉన్న అదనపు వైర్లేనని గుర్తించిన అధికారులు వెంటనే వాటిని ఎక్కడికి అక్కడ తీసేసారు. విద్యుత్ స్తంభాలపై ఎలాంటి కేబుల్ వైర్లు ఉన్నా.. వాటిని తొలగించారు. అయితే ఇలా తొలగించడం ఒకరకంగా మంచికే అయినా… మరో రకంగా మాత్రం తీవ్ర నష్టం జరిగిందని కొందరు ఆవేదన చెందుతున్నారు. ఆకస్మికంగా కేబుల్స్ కట్ చేయడం వల్ల ఇంటర్నెట్ సరఫరా ఆగిపోయిందని.. దీంతో వర్క్ ఫ్రం హోం చేసేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు పేర్కొంటున్నారు. ఈ మేరకు Cellular Operators Association of India (COAI ) ఆందోళన వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Also Read: విశాఖకు కేంద్రం గుడ్ న్యూస్!
ఉన్నటువంటి ఒకేసారి కేబుల్స్ కట్ చేయడం వల్ల ఇంటర్నెట్ సరఫరా ఆగిపోయింది. ఇలా పెద్ద ఎత్తున కేబులు కోత పెట్టడం వల్ల ఇంటర్నెట్ సరఫరా కాకపోవడంతో దీనిపైనే ఆధారపడి పని చేసిన వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని COAI సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ షాక్ కు కేబుల్ వైర్లకు ఎటువంటి సంబంధం లేదని.. ఇంటర్నెట్ కేబుల్ ద్వారా విద్యుత్ సరఫరా కాదని.. కానీ ఇలా అనుకోకుండా కేబుల్స్ కట్ చేయడం వల్ల ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని వాళ్ళు చెబుతున్నారు.
ఇంటర్నెట్ పై ఆధారపడి ఎంతోమంది వర్క్ చేసుకుంటున్నారని.. వారికి ఒక్కసారిగా ఇంటర్నెట్ ఆగిపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం చేసేవారు.. డిజిటల్ తరగతులు నిర్వహించేవారు.. ఆన్లైన్లో తరగతులు వినేవారు.. వీడియో కాన్ఫరెన్స్లో నిర్వహించుకునేవారు… కేబుల్స్ కట్ చేయడం వల్ల ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారని అంటున్నారు. ఇంటర్నెట్ లేకపోతే ప్రస్తుతం ఎన్నో రకాలుగా సమస్యలు ఉంటాయని.. ప్రతి పని ఇంటర్నెట్ తోనే సంబంధం ఉందని.. అందువల్ల ఇంటర్నెట్ కేబుల్ లో విషయంలో విద్యుత్ అధికారులు సంయమనం పాటించాలని కోరుతున్నారు.
ఎక్కడైనా ఇంటర్నెట్ కేబుల్ ద్వారా ఇబ్బంది ఉంటే సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపించాలని.. అలా కాకుండా ఇలా ఆకస్మికంగా ఎక్కడపడితే అక్కడ టేబుల్స్ కట్ చేయడం వల్ల.. పునరుద్ధరణకు తీవ్ర కష్టమవుతుందని అంటున్నారు. ప్రస్తుతం టేబుల్స్ కట్ చేయడం వల్ల కొన్ని రోజులపాటు ఇంటర్నెట్ సరఫరా ఉండదని.. అయితే వీటి మరమ్మతు కోసం సిబ్బంది తీవ్ర కష్టాలు పడుతున్నారని అంటున్నారు. ప్రతిసారి ఇలా కేబుల్స్ కట్ చేస్తూ ఎన్నో రకాలుగా నష్టాలకు గురిచేస్తున్నారని అంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి అంతరాయాలు లేకుండా చూడాలని టేబుల్స్ ఆపరేటర్ అసోసియేషన్ విద్యుత్ అధికారులకు వినతి పత్రాన్ని అందించారు.