Jr NTR War 2 Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తూ ఉంటారు.సగటు ప్రేక్షకులు సైతం వాళ్లని చూసే సినిమాలను చూడడానికి థియేటర్ కి వస్తూ ఉంటారు. కాబట్టి స్టార్ హీరోలకు ఎక్కువమంది అభిమానులు ఉండడంలో తప్పులేదు. ఇక వాళ్ళ సినిమాలు వస్తున్నాయంటే చాలు వాళ్ళ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు సినిమా థియేటర్ కి వచ్చి సినిమాలను చూసి సూపర్ సక్సెస్ లను చేస్తుంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు సైతం నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఐడెంటిటిని ఏర్పాటు చేసుకున్నాడు…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టినవే కావడం విశేషం…ఇక రీసెంట్ గా ఆయన చేసిన ‘వార్ 2’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించకపోవడంతో ఆయన కొంతవరకు డీలా పడిపోయాడు. వరుసగా ఏడు విజయాలను అందుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో ఎనిమిదోవ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటానని చాలా భరోసాను వ్యక్తం చేసినప్పటికి ఈ సినిమా అనుకున్న రేంజ్ లో లేకపోవడం ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ పెద్దగా ప్రేక్షకులకు నచ్చకపోవడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేస్తున్నారు.
Also Read: పాన్ ఇండియా సినిమాలు తీయాలంటే ఈ నలుగురు హీరోల వల్లే అవుతుందా..?
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో పాటుగా ఆయన ఇక మీదట చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ సినిమా మీద కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు. దర్శకుడు స్టోరీ చెప్పినప్పుడు తన క్యారెక్టర్ విషయంలో చాలా వేరియేషన్స్ ఉన్నాయని చెప్పాడట…
కానీ స్క్రీన్ మీదకి తీసుకొచ్చే క్రమంలో మాత్రం కేవలం తన క్యారెక్టర్ ను నెగెటివ్ చేసి చూపించాడని దాని వల్ల ఎన్టీఆర్ కొంతవరకు ఇబ్బంది పడ్డట్టుగా తెలుస్తోంది. మరి ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయనని అసలు మల్టీ స్టారర్ సినిమాల మీద తను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించనని తన సన్నిహిత వర్గాల దగ్గర తెలియజేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి…
Also Read: ‘వార్ 2’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు..నష్టాల్లో ఆల్ టైం రికార్డు!
మరి తను అనుకున్నట్టుగానే ఇకమీదట భారీ సక్సెస్ లను సాధించి పాన్ ఇండియాలో స్టార్ హీరో రేంజ్ లో దూసుకుపోతాడా లేదంటే తన మార్కెట్ ను అంతకంతకు తగ్గించుకుంటూ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోలందరి కంటే తను వెనుకబడిపోతాడా అనేది తెలియాల్సి ఉంది…