Bunny Vasu Strong Counter: ఈమధ్య కాలం లో నిత్యం ట్రెండింగ్ లో పేరు బన్నీ వాసు(Bunny Vasu). అల్లు కాంపౌండ్ నుండి వచ్చిన ఈయన ఈమధ్య కాలంలో చేస్తున్న ప్రతీ సినిమా సూపర్ హిట్ గా నిలుస్తుంది. నిర్మాతగా మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఆయన పట్టిందల్లా బంగారం లాగా మారిపోతుంది. ఇన్ని రోజులు గీత ఆర్ట్స్ లోనే సహనిర్మాతగా వ్యవహరిస్తూ వచ్చిన బన్నీ వాసు, మొట్టమొదటిసారి అల్లు కాంపౌండ్ నుండి బయటకు వచ్చి తన స్నేహితులతో కలిసి చేసిన చిత్రం ‘మిత్ర మండలి’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా లో మ్యాడ్ ఫేమ్ విష్ణు, రాగ్ మయూర్ లతో పాటు ప్రముఖ యూట్యూబర్ నిహారిక ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ నెల 18 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు .
ఈ ఈవెంట్ లో బన్నీ వాసు మాట్లాడిన మాటలు పెద్ద దుమారమే రేపాయి. తన సినిమాపై కొంతమంది నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అంటూ ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఎవరిని ఉద్దేశించి చేసినవో అర్థం కావడం లేదు. చాలా మంది ఇది ప్రముఖ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పీఆర్ టీం చేయిస్తుందని అంటున్నారు. ఎందుకంటే ఆయన హీరో గా నటించిన K ర్యాంప్ చిత్రం కూడా అదే రోజున విడుదల కాబోతుంది కాబట్టి. పోటీ గా వస్తుండడంతో కావాలని ఆయన పక్క సినిమాలపై నెగిటివ్ ప్రచారం చేయిస్తున్నారు అనే రూమర్ ఉంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. బన్నీ వాసు మాట్లాడుతూ ‘నా సినిమా పై కొంతమంది విషం చిమ్ముతున్నారు. విడుదలకు ముందే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. వాళ్లకు నేను ఇదే చెప్తున్నాను. నా వెంట్రుక కూడా పీకలేరు’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నేను మర్యాద ఉన్న వాడిని కాబట్టి, తల మీదున్న వెంట్రుక కూడా పీకలేరు అంటున్నాను, వేరే భాగాల్లో ఉన్న వెంట్రక తో కూడా పోల్చొచ్చు. నేను నా సినిమా మాత్రమే కాకుండా, ఇతర సినిమాలు బాగా ఆడాలని కోరుకునేవాడిని. ఒకవేళ నా సినిమా బాగాలేకపోతే ఇతర సినిమాలు బాగా ఆడాలి అని కోరుకునే మనస్తత్వం నాది. మీలా దిగజారే పనులు నేను చేయలేను. కనీసం నెగిటివ్ గా రాసేవాళ్ళు డబ్బులు ఎక్కువ తీసుకొని రాయండి. పాజిటివ్ గా రాస్తే మీకు ఏమి రాదనీ నెగిటివ్ గా రాస్తున్నారు, కనీసం డబ్బులు అయినా ఎక్కువ డిమాండ్ చేయండి’ అంటూ బన్నీ వాసు చాలా ఫైర్ మీద మాట్లాడాడు. ఇది కిరణ్ అబ్బవరం కి కౌంటర్ ని సోషల్ మీడియా లో అత్యధిక శాతం మంది అంటున్నారు, కానీ ఈ రెండు సినిమాల తో పాటు మరో రెండు సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి, బహుశా వాళ్ళని ఉద్దేశించి బన్నీ వాసు ఈ కామెంట్స్ చేసి ఉండొచ్చు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.