Rishab Shetty latest news: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. ఏ భాషలో ఏ హీరో సినిమా చేసిన అన్ని భాషల ప్రేక్షకులు ఆ సినిమాని చూసి బాగుంటే ఆదరిస్తున్నారు. లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాల హవా ఎక్కువైపోయింది. మన వాళ్ళు చేసిన ప్రతి సినిమా పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తూ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తూ ఉండడం విశేషం… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా మన హీరోలకు ఉన్న గుర్తింపు మరే హీరోలకి దక్కడం లేదు. ఇక కాంతార సినిమాతో మంచి విజయాన్ని సాధించిన రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతర చాప్టర్ వన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడమే కాకుండా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తోంది.
ఇక ఇప్పటివరకు 500 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టిన ఈ సినిమా లాంగ్ రన్ లో మరింత కలెక్షన్స్ ని రాబట్టే అవకాశాలైతే ఉన్నాయి…ఇక ఈ మూవీ కేవలం 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా 500 నుంచి 600 కోట్ల వసూళ్లను రాబట్టడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి… ఇక రిషబ్ శెట్టిని చూసి మన తెలుగు హీరోలు, దర్శకులు చాలా నేర్చుకోవాల్సిన అవసరమైతే ఉంది.
రిషబ్ శెట్టి అటు హీరోగా, ఇటు దర్శకుడిగా రాణిస్తూ మంచి విజయాన్ని సాధించి పెట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీతో సినిమాని ఎలా చేయాలి అనేది రిషబ్ శెట్టి కి చాలా బాగా తెలుసు… అందుకే మంచి క్వాలిటీ ప్రొడక్ట్ లను ఇస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటున్నాడు. ఇక ‘కాంతార చాప్టర్ 2’ సినిమా కూడా ఉండబోతోంది.
ఇక ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో చేస్తున్న ‘జై హనుమాన్’ సినిమాలో హనుమంతుడి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక మొత్తానికైతే తన సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ రిషబ్ శెట్టి మంచి విజయాలను అందుకుంటున్నాడు… ఇక మన హీరోలు, దర్శకులు చాలా విషయాల్లో అప్డేట్ అవ్వాలి లేకపోతే మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిధి అనేది అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం చాలా కష్టమవుతుంది…