Bunny Vasu Counter To Bandla Ganesh: ఈ ఏడాది సైలెంట్ గా వచ్చి, బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ లాంటి వసూళ్లను రాబట్టిన చిన్న సినిమాల్లో ఒకటి ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts Movie). ప్రముఖ యూట్యూబర్ మౌళి హీరో గా నటించిన ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. సినిమా విడుదలై రెండు వారాలు కావొస్తుంది, కానీ ఇప్పటికీ కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓజీ చిత్రం వచ్చే వరకు ఈ సినిమాకు థియేట్రికల్ రన్ వచ్చే అవకాశం ఉండడం తో మరో పది కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా ఈ సినిమాకు అదనంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.
ఇక పోతే నిన్న ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ మూవీ టీం తో పాటు, ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేసిన బన్నీ వాసు, అల్లు అరవింద్(Allu Aravind) వంటి వారు కూడా వచ్చారు. ఇక చాలా కాలం తర్వాత బండ్ల గణేష్(Bandla Ganesh) కూడా ఈ ఈవెంట్ లో పాల్గొన్నాడు. మనోడు వచ్చాడంటే సైలెంట్ గా ఉండదు కదా, ఎదో ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేసి వెళ్తాడు. ఈ సినిమా విజయోత్సవ సభలో కూడా అదే చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల చేసిన బన్నీ వాసు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. పాపం ఈయన ఏమి చేసినా అల్లు అరవింద్ గారి క్రెడిట్ లో పడుతుంది. అల్లు అరవింద్ చేసేది ఏమి ఉండదు’ అంటూ కామెంట్స్ చేసాడు. దీనికి బన్నీ వాసు ఇదే ఈవెంట్ లో కౌంటర్ ఇచ్చాడు.
ఆయన మాట్లాడుతూ ‘బండ్ల గణేష్ గారు వెళ్ళిపోయినట్టు ఉన్నాడు. అల్లు అరవింద్ గారు స్టార్ కమెడియన్ కి కొడుకుగా పుట్టలేదు. ఆయన పుట్టిన తర్వాత అల్లు రామలింగయ్య గారు స్టార్ కమెడియన్ అయ్యాడు. బండ్లన్న కి తెలియదు ఏమో ఆ విషయం. ఈ వయస్సు లో కూడా అల్లు అరవింద్ గారు మాకు ఆదర్శంగా నిలుస్తూ రెట్టింపు ఉత్సాహం తో పని చేసేలా చేస్తుంటారు. అల్లు అరవింద్ గారు ఈ సినిమాలో మిమ్మల్ని ఎక్కడ మిస్ అయ్యాను అంటే, నాకు పని తక్కువ పడింది మీరు లేకపోవడం వల్ల, అంత పని పెడుతుంటాడు నాకు. అంటే ఆయన నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోనివ్వదు, అనుకున్న పని టైం కి అవ్వాల్సిందే, లేదంటే అసలు ఊరుకోడు’ అంటూ చెప్పుకొచ్చాడు బన్నీ వాసు.
#BandlaGanesh అల్లు అరవింద్ పై చేసిన కామెంట్స్ కి React అయిన #BunnyVas pic.twitter.com/sVO9sTQQRn
— IndiaGlitz Telugu™ (@igtelugu) September 18, 2025