https://oktelugu.com/

Bichagadu 2 Collections: ‘బిచ్చగాడు 2’ కి బంపర్ ఓపెనింగ్స్.. ఒక్క రోజులోనే ఆ స్టార్ హీరోల క్లోసింగ్ కలెక్షన్స్ అవుట్!

గతం లో ఇలాంటి ఉదాహరణలు చాలానే చూసాం కాబట్టి చిన్న ఉదాహరణ అంటున్నాం.అలాంటి బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ తీస్తున్నారు అని చెప్పిన రోజే ఈ చిత్రం పై అంచనాలు నెలకొన్నాయి. ఆ తర్వాత కొంతకాలం క్రితం ఈ సినిమా మొదటి పది నిమిషాలను డైరెక్ట్ గా యూట్యూబ్ లో విడుదల చేసింది మూవీ టీం.ఆ పది నిమిషాల వీడియో ఆడియన్స్ లో చాలా ఆసక్తిని రేపేలా చేస్తుంది.

Written By:
  • Vicky
  • , Updated On : May 19, 2023 / 03:45 PM IST

    Bichagadu 2 Collections

    Follow us on

    Bichagadu 2 Collections: మన టాలీవుడ్ లో బిచ్చగాడు అనే చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో హీరో ఎవరో కూడా అప్పటి ఆడియన్స్ కి తెలియదు. అయినా కూడా బాక్స్ ఆఫీస్ ని ఆ రేంజ్ దున్నేసింది అంటే అందుకు కారణం కంటెంట్. కంటెంట్ బాగుంటే మన ఆడియన్స్ సినిమాని నెత్తిన పెట్టుకొని మరీ ఆరాధిస్తారు అనడానికి ఒక చిన్న ఉదాహరణ ఈ చిత్రం.

    గతం లో ఇలాంటి ఉదాహరణలు చాలానే చూసాం కాబట్టి చిన్న ఉదాహరణ అంటున్నాం.అలాంటి బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ తీస్తున్నారు అని చెప్పిన రోజే ఈ చిత్రం పై అంచనాలు నెలకొన్నాయి. ఆ తర్వాత కొంతకాలం క్రితం ఈ సినిమా మొదటి పది నిమిషాలను డైరెక్ట్ గా యూట్యూబ్ లో విడుదల చేసింది మూవీ టీం.ఆ పది నిమిషాల వీడియో ఆడియన్స్ లో చాలా ఆసక్తిని రేపేలా చేస్తుంది.

    ఇక ఈరోజు గ్రాండ్ గా తెలుగు మరియు తమిళ బాషలలో విడుదలైన ఈ సినిమాకి సోషల్ మీడియా లో యావరేజి రివ్యూస్ వచ్చాయి. కానీ ఓపెనింగ్స్ మాత్రం బంపర్. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ థియేటర్ ని చూసిన హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి.ఈ చిత్రం మొదటి రోజు వసూళ్లు ఈ సమ్మర్ లో విడుదలైన కొంతమంది క్రేజీ హీరోల మొదటి రోజు వసూళ్లను అతి తేలికగా దాటేస్తుందని అంటున్నారు. అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘ఏజెంట్’ చిత్రానికి మొదటి రోజు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

    కానీ బిచ్చగాడు చిత్రానికి ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం కనీసం నాలుగు కోట్ల రూపాయలకు తగ్గకుండా ఓపెనింగ్ వస్తుందని అంటున్నారు.ఇక తమిళ మొదటి రోజు వసూళ్లను కూడా కలిపితే ఏజెంట్ క్లోసింగ్ కలెక్షన్స్ ని మొదటి రోజే దాటినట్టు అవుతుంది. కాస్త పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే, ఈ సినిమా క్లోసింగ్ కలెక్షన్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉండేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.