Bulli Raju : ఈ ఏడాది విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో మనమంతా చూసాము. సుమారుగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమాలో హైలైట్ అయిన సన్నివేశాలు ఒక నాలుగైదు తీస్తే, అందులో బుల్లి రాజు(Bulli Raju) క్యారెక్టర్ కి సంబంధించిన సన్నివేశం కచ్చితంగా ఉంటుంది. ఈ క్యారక్టర్ మాట్లాడే భూతులను చూసి థియేటర్స్ లో ఆడియన్స్ పొట్టచెక్కలు అయ్యేలా నవ్వుకున్నారు. ఈ క్యారెక్టర్ పోషించిన బుడ్డోడి పేరు రేవంత్(Revanth). ఎన్నికల ప్రచారం లో హుషారుగా క్యాంపైన్ చేస్తూ కనిపించిన వీడియోలను చూసి డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) పిలిపించి మరీ ఈ సినిమాలో అవకాశం ఇచ్చాడు. అనుకున్న దానికంటే ఆ క్యారెక్టర్ కి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ బుడ్డోడికి టాలీవుడ్ లో ఆఫర్స్ క్యూలు కడుతున్నాయి. డిమాండ్ కి తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ కూడా భారీగా డిమాండ్ చేస్తున్నాడు.
Also Read : అర్జున్ చేతిలో ఉన్న ఈ పిల్లాడిని గుర్తుపట్టగలరా.. రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ లో కూడా హీరో..
ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ బుడ్డోడి కాల్ షీట్ ఒక్క రోజు కోసం కావాలంటే లక్ష రూపాయిలు చెల్లించాలట. టాప్ మోస్ట్ కమెడియన్స్ ఈ రేంజ్ రెమ్యూనరేషన్స్ తీసుకుంటూ ఉండేవారు. అప్పట్లో బ్రహ్మానందం రెగ్యులర్ గా సినిమాలు చేసేటప్పుడు రోజుకి రెండు నుండి మూడు లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసేవాడట. మిగిలిన టాప్ కమెడియన్స్ లక్ష నుండి రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారట. ఇప్పుడు ఈ బుడ్డోడు ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నాడు. ఇక మీదట ఇతను ఏ సినిమాలో కనిపించిన థియేటర్స్ లో ఈలలు చప్పట్లతో ఆడియన్స్ హోరెత్తించేస్తారు. ఇతని సన్నివేశాలు క్లిక్ అయ్యాయి అంటే కచ్చితంగా థియేటర్స్ కి ఆడియన్స్ కదులుతారు. అందుకే డిమాండ్ కి తగ్గట్టే ఈ బుడ్డోడి తల్లిదండ్రులు ఈ రేంజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో ఇతను ఎన్ని సినిమాలు చేస్తాడు?, ఒకవేళ చేసిన ఆ క్యారెక్టర్స్ బుల్లిరాజు రేంజ్ లో సక్సెస్ అవుతాయా లేదా అనేది.
Also Read : విష్ణుప్రియ తో పాటు 10 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు..అరెస్ట్ తప్పదా?