Bujji Thalli Video Song ఇటీవల విడుదలైన కొత్త సినిమా పాటలలో నాగ చైతన్య హీరో గా నటించిన ‘తండేల్’ చిత్రం లోని ‘బుజ్జి తల్లి’ అనే పాట ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దేవిశ్రీప్రసాద్ పని అయిపోయింది, ఆయన పాటలు ఈమధ్య సరిగా జనాలకు నచ్చడం లేదు అంటూ కామెంట్స్ చేసేవారికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది ఈ పాట. నెల రోజుల క్రితం విడుదలైన ఈ పాటకు 48 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. అప్పటి వరకు ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు లేవు. ఎప్పుడైతే ఈ పాట వచ్చిందో అప్పటి నుండి అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. చక్కటి సాహిత్యం, చెవుల్లో అమృతం పొసే రేంజ్ ఆహ్లాదం ని అందించే మ్యూజిక్, వింటేజ్ దేవి శ్రీ ప్రసాద్ మాస్ ఏంటో మరోసారి ఆడియన్స్ కి రుచి చూపించిన పాట ఇది.
నెల రోజుల క్రితం వచ్చింది కేవలం లిరికల్ వీడియో సాంగ్ మాత్రమే. నేడు ఈ సినిమా కి సంబంధించి ఒరిజినల్ వీడియో సాంగ్ ని విడుదల చేసారు. దీనికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కథలో మంచి బలం ఉంది, కమర్షియల్ గా ఈ చిత్రం వండర్స్ సృష్టిస్తుంది అనే ఫీలింగ్ కలిగించింది ఈ పాట. నాగ చైతన్య కి చాలా కాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు. బంగార్రాజు తర్వాత ఆయన చేసిన ‘థాంక్యూ’, ‘కస్టడీ’ చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. కనీసం పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయాయి ఈ సినిమాలు. అలాంటి దయనీయమైన పరిస్థితిలో ఉన్న నాగచైతన్య కి ఈ చిత్రం పెద్ద కం బ్యాక్ ఇచ్చేలా అనిపిస్తుంది. అల్లు అరవింద్ నిర్మాతగా గీత ఆర్ట్స్ పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇకపోతే ఈ చిత్రం పై మరింత క్రేజ్ పెరగడానికి ముఖ్య కారణం సాయి పల్లవి. ఈమెకు యూత్, మాస్ ఆడియన్స్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. కేవలం ఈమె కోసం థియేటర్స్ కి కదిలే అభిమానులు లక్షల్లో ఉంటారు. రీసెంట్ గానే ఆమె ‘అమరన్’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టి మంచి ఫామ్ లోకి వచ్చింది. అది కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది అని చెప్పొచ్చు. ఫిబ్రవరి 7 వ తారీఖున భారీ లెవెల్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కి నిర్మాత అల్లు అరవింద్ దాదాపుగా 70 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. చూడాలి మరి కమర్షియల్ గా ఈ చిత్రం ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది.