Ram Charan and Buchibabu : తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలను తొక్కుతూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇకమీదట వచ్చే సినిమాలు కూడా చాలా కొత్త కథలతో వస్తే ఇండస్ట్రీలో ఎప్పుడు ఆదరణ దక్కుతుందనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు రాబోతున్న కథలతో వాళ్ళకంటూ ఒక మంచి విజయాలను సాధించాలని చూస్తున్న స్టార్ హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…
మెగా పవర్ స్టార్ (Mega Power Star) గా తనకంటూ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan)… ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరమైతే ఏర్పడింది. ఎందుకంటే రీసెంట్ గా ఆయన చేసిన గేమ్ చేంజర్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేదు. దాంతో ఈ సినిమాతో భారీగా తన ఇమేజ్ ను కోల్పోయిన రామ్ చరణ్…ఇప్పుడు చేస్తున్న సినిమా విషయంలో చాలావరకు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకు అంటే ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాతో గ్లోబల్ స్టార్ (Global Star) గా అవతరించిన రామ్ చరణ్ ఆ తర్వాత చేసిన ఆచార్య (Acharya) సినిమాతో ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఇక దానికి తోడుగా గేమ్ చేంజర్ (Game Changer) సినిమా విషయంలో కూడా ఇది మరోసారి ప్రూవ్ అయింది. కాబట్టి గ్లోబల్ స్టార్ గా పేరు గాంచిన ఆయన బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సాధిస్తే తప్ప గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కి అర్థం అయితే ఉండదు. కాబట్టి తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. అందువల్లే చిరంజీవి (Chiranjeevi) సైతం రామ్ చరణ్ బుచ్చిబాబుతో చేస్తున్న సినిమాలో ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించిన మార్పులు చేర్పులు చేయమని చిరంజీవి చెప్పారట. మరి దానికి తగ్గట్టుగానే బుచ్చిబాబు సైతం వాటిని అంగీకరించి ఆ మార్పులను చేసినట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా బుచ్చిబాబు సుకుమార్ ఇద్దరితో చేస్తున్న సినిమాలతో రామ్ చరణ్ తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. లేకపోతే మాత్రం మిగతా హీరోల కంటే కూడా ఆయన చాలా వరకు వెనుకబడిపోయే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
ఇక శంకర్ పూర్తిగా తన ఫామ్ ను కోల్పోవడంతో గేమ్ చేంజర్ సినిమాని సక్సెస్ గా నిలుపలేకపోయాడనేది వాస్తవం. కాబట్టి శంకర్ తో సినిమాలు చేయడానికి ఏ తెలుగు హీరో కూడా సాహసం చేసే అవకాశాలైతే లేనట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఆయన తన తదుపరి సినిమాలను తమిళ్ హీరోలతో చేస్తే తప్ప అతనికి ఛాన్సులు ఇచ్చే అవకాశాలైతే లేవు.
ఇక గేమ్ చేంజర్ కోసం విపరీతంగా బడ్జెట్ ను ఖర్చు పెట్టించిన ఆయన ఆ సినిమా అవుట్ పుట్ మీద తనకు సంతృప్తిగా లేదని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం… ఇక ఐదు గంటల సినిమా అవుట్ పుట్ ను తీసిన ఆయన అందులో నుంచి చాలా సీన్లను కట్ చేయడం వల్ల సినిమా అనుకున్న రేంజ్ లో రాలేదు అంటూ కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేశాడు…