మళ్ళీ మాజీ బబ్లీ బ్యూటీ రెడీ.. అందు కోసమేనట !

ఛార్మి.. ఇరవై ఏళ్ళు కూడా నిండకుండానే సీనియర్ హీరోయిన్ అనిపించుకుంది. అంటే, అంత చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అన్నమాట. మొత్తం కెరీర్ లో నానాపాట్లు పడి మొత్తానికి హీరోయిన్ గా నాలుగు రాళ్లు వెనుకేసుకుని.. చివరకు నిర్మాత అవతారం ఎత్తి.. ప్రస్తుతం పూరి సాన్నిహిత్యంలో తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది ఛార్మి. ఇప్పుడు నిర్మాత అయితే అయింది గానీ, ఛార్మి ఒకప్పుడు తన గ్లామర్ తో హీరోయిన్ గా ఒక ఊపు ఊపేసింది. హద్దులు […]

Written By: Neelambaram, Updated On : December 14, 2020 7:18 pm
Follow us on


ఛార్మి.. ఇరవై ఏళ్ళు కూడా నిండకుండానే సీనియర్ హీరోయిన్ అనిపించుకుంది. అంటే, అంత చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అన్నమాట. మొత్తం కెరీర్ లో నానాపాట్లు పడి మొత్తానికి హీరోయిన్ గా నాలుగు రాళ్లు వెనుకేసుకుని.. చివరకు నిర్మాత అవతారం ఎత్తి.. ప్రస్తుతం పూరి సాన్నిహిత్యంలో తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది ఛార్మి. ఇప్పుడు నిర్మాత అయితే అయింది గానీ, ఛార్మి ఒకప్పుడు తన గ్లామర్ తో హీరోయిన్ గా ఒక ఊపు ఊపేసింది. హద్దులు దాటిన ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోయి మరీ, కుర్రాళ్లకు మంచి కిక్ ను ఇచ్చింది. మొత్తం మీద ‘నీతోడు కావాలి’ అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటరైన ఈ మాజీ బ్యూటీ మళ్ళీ గ్లామర్ చూపించడానికి రెడీ అంటుంది.

నిజానికి బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో ‘బుడ్డా హోగా తేరే బాప్.. అంటూ ఛార్మి హిందీలో కూడా ఒక వెలుగు వెలగటానికి ప్రయత్నించి దారుణంగా విఫలం అయింది. అప్పటినుండే ఆమెకు నటన పై ఇంట్రస్ట్ పోయిందట. దాంతోనే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో ‘జ్యోతిలక్ష్మి’ అంటూ టాలీవుడ్ లో నిర్మాతగానూ మారి.. ప్రస్తుతం పూరితోనే సినిమాలు నిర్మిస్తూ అలా తన జర్నీని ప్లాన్ చేసుకుంది. అయితే, తాజాగా ఛార్మితో ఓ పెద్ద నిర్మాత ‘మళ్ళీ మిమ్మలిని హీరోయిన్ గా చూడాలనుకుంటున్నాను. నా కోసం ఒక్క సిరీస్ నైనా చేయండి’ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడట.

ఆ నిర్మాతే పీవీపీ అని తెలుస్తోంది. అందుకే, పీవీపీ కోసం ఛార్మి ఓ వెబ్ సిరీస్ చేయడానికి ఒప్పుకుందట. పైగా ఛార్మి అభిమానులు కూడా ఎప్పటినుండో మళ్ళీ మా కోసం ఓ సినిమా చేయండి అని అడుగుతున్నారట. అందుకే తన అభిమానుల కోసమైన ఒక్క సినిమా గాని, ఒక వెబ్ సిరీస్ గాని చేస్తే బావుంటుందని.. నా కోసం ఒక కొత్త కథను రెడీ చేయి అంటూ.. పట్టుబట్టి పూరి చేత ఒక కథ కూడా రాయించుకుందట. మరి ఈ సిరీస్ లో ఛార్మి ఎలా కనిపిస్తోందో చూడాలి. ఇంతకీ ఈ సిరీస్ ఎలా ఉంటుందో.