https://oktelugu.com/

Bro Movie Trailer: ‘బ్రో ది అవతార్’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల తేదీ ఫిక్స్.. 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ దద్దరిల్లిపోయేలా గ్రాండ్ గా ప్లానింగ్!

పవన్ కళ్యాణ్ సినిమా అంటే సంగీత దర్శకుడు థమన్ తన విశ్వరూపం చూపించేస్తాడు. కానీ ఈ సినిమా దగ్గరకి వచ్చేసరికి పాటలు చాలా చెత్తగా కొట్టాడు అని అభిమానులు చాలా నిరాశలో ఉన్నారు. ఇకపోతే సినిమా మీద హైప్ అర్జెంటు గా రావడానికి ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ట్రైలర్ కట్ ఎప్పుడో సిద్ధం అయ్యింది. కేవలం పవన్ కళ్యాణ్ డబ్బింగ్ మరియు థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కటే బ్యాలన్స్.

Written By:
  • Vicky
  • , Updated On : July 17, 2023 / 02:29 PM IST
    Follow us on

    Bro Movie Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తిన్న ‘బ్రో ది అవతార్’ చిత్రం ఈ నెల 28 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ , పాటలు విడుదల అయ్యాయి. టీజర్ కి అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ రాగా, పాటలకు చాలా పూర్ రెస్పాన్స్ వచ్చింది.

    పవన్ కళ్యాణ్ సినిమా అంటే సంగీత దర్శకుడు థమన్ తన విశ్వరూపం చూపించేస్తాడు. కానీ ఈ సినిమా దగ్గరకి వచ్చేసరికి పాటలు చాలా చెత్తగా కొట్టాడు అని అభిమానులు చాలా నిరాశలో ఉన్నారు. ఇకపోతే సినిమా మీద హైప్ అర్జెంటు గా రావడానికి ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ట్రైలర్ కట్ ఎప్పుడో సిద్ధం అయ్యింది. కేవలం పవన్ కళ్యాణ్ డబ్బింగ్ మరియు థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కటే బ్యాలన్స్.

    పవన్ కళ్యాణ్ ఈమధ్యనే ‘వారాహి విజయ యాత్ర’ రెండవ విడత పూర్తి చేసాడు. నేడు తిరుపతి లో జనసేన పార్టీ నేత పై చెయ్యి చేసుకున్న పోలీస్ అధికారి అంజు మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. రేపు ఎన్డీయే మీటింగ్ లో పాల్గొనడానికి ఢిల్లీ కి వెళ్తున్నాడు. అనంతరం ఆయన హైదరాబాద్ చేరుకొని , ‘బ్రో’ చిత్రానికి డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చెయ్యబోతున్నాడు. ముందుగా ఆయన ట్రైలర్ కి డబ్బింగ్ పూర్తి చేస్తాడు. ఆయన డబ్బింగ్ చెప్పిన వెంటనే ఈ నెల 22 వ తారీఖున ట్రైలర్ ని విడుదల చేయబోతున్నాం అని అధికారికంగా ప్రకటించబోతున్నారు మేకర్స్.

    ఈ ట్రైలర్ ని రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న థియేటర్స్ అన్నిట్లో గ్రాండ్ గా విడుదల చెయ్యబోతున్నారు. గతం వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ ని ఇలాగే థియేటర్స్ లో విడుదల చేసారు. ఎప్పుడైతే అలా విడుదల చేసారో అప్పుడు ఆ చిత్రానికి ఎక్కడ లేని హైప్ మొత్తం ఏర్పడింది. బ్రో చిత్రానికి కూడా అలాగే జరగబోతుంది అని అంటున్నారు,చూడాలి మరి.