Britney Spears arrested: బిట్నీ స్పియర్స్.. పరిచయం అక్కరలేని పేరు. పాప్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే ఈ సింగర్ పాటలంటే పడి చచ్చేంత ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె షోకు హాజరయ్యేవారు లక్షల్లో ఉంటారు. ఇంటి పాపులారిటీ ఉన్న సింగర్‌కు అమెరికా పోలీసులు షాక్ ఇచ్చారు. క్యాలిఫోర్నియాలోని వెంచురా కౌంటీలో మార్చి 4 రాత్రి డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్(డీయూఐ) కారణంగా అరెస్ట్ చేశారు. మద్యం, మాంద్యాల మిశ్రమం సేవించి వాహనం నడిపిన ఆరోపణలపై ఆమెను రాత్రి 9:30 గంటలకు పట్టుకుని తెల్లవారుజామున 3 గంటలకు కేస్ బుక్‌చేసి.. ఉదయం 6 గంటలకు వదిలిపెట్టారు.
అరెస్ట్ వివరాలు
బ్లాక్ బీఎండబ్ల్యూ 430జీ వాహనం స్వర్వింగ్, ఓవర్ స్పీడ్‌తో 101 ఫ్రీవేలో కనిపించడంతో విట్నెస్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెస్ట్‌లేక్ బుల్‌వర్డ్ వద్ద పోటీసులు ఆపి, ఫీల్డ్ సోబ్రైటీ టెస్ట్‌లు చేపట్టగా ఆమె ఇంపెయిర్డ్గా ఉన్నారని నిర్ధారణ అయింది. వెంచురా షెరిఫ్ ఆఫీస్ రికార్డుల ప్రకారం ‘సైట్ అండ్ రిలీజ్‘గా ముగిసింది.
న్యాయపరమైన చర్యలు..
కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆమె మే 4న కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే బ్రిట్నీ ప్రతినిధులు ‘అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్‘గా పేర్కొని, చట్టాలకు కట్టుబడి మార్పు తీసుకుంటానని తెలిపారు.
44 ఏళ్ల బ్రిట్నీకి ఇది కొత్త సంఘటన కాదు. 2021లో కన్జర్వేటర్‌షిప్ బ్యాటిల్ తర్వాత జీవితం స్థిరపడినట్లు కనిపించినా, ఆరోగ్య సమస్యలు, కుమార్తెలతో దూరం కొనసాగుతున్నాయి. మగాడిని హరాస్మెంట్పై రెస్ట్రైనింగ్ ఆర్డర్ పొందిన కొన్ని రోజుల తర్వాత ఈ అరెస్ట్ వచ్చింది.