HomeNewsPawan kalyan: సినిమాటోగ్రాఫర్​ మ్యాజిక్​కు పవర్​స్టార్​ ఫిదా.. ట్విట్టర్​లో ఫొటోలు వైరల్​!

Pawan kalyan: సినిమాటోగ్రాఫర్​ మ్యాజిక్​కు పవర్​స్టార్​ ఫిదా.. ట్విట్టర్​లో ఫొటోలు వైరల్​!

Pawan kalyan: టాలీవుడ్​లో ఉన్న టాప్​ 10 సినిమాటోగ్రాఫర్స్​లో రవి కె చంద్రన్​ ఒకరు. అయితే, ఈయన టాలెంట్​కు పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ ఫిదా అయ్యారు. పవన్​ హీరోగా నటిస్తున్న భీమ్లానాయక్​ ఇటీవల షూటింగ్​ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే పోస్ట్ ప్రడక్షన్​ పనుల్లో భాగంగా ఎడిటింగ్​ చేసిన ఫుటేజీని చూసిన పవన్​.. విజువల్స్​తో చాలా ఇంప్సెస్​ అయ్యారు. ఈ నేపథ్యంలోనే పవన్​, త్రివిక్రమ్​, సాగర్ కె చంద్ర, ఇతర యూనిట్​ సభ్యులు చంద్రన్​ ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రవి కె చంద్రన్ ట్విట్టర్​ వేదికగా పంచుకున్నారు. పుష్పగుచ్చంపై పవన్ స్వయంగా రాసిన ప్రత్యేక నోట్​ ఉంది. ప్రియమైన రవి కె చంద్రన్​ సర్​.. భీమ్లానాయక్​లో మీ విజువల్స్ నిచంగా అద్భుతం, ఈ సినిమాలో మీరూ భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది.  అని నోట్​లో రాశారు పవన్​ కల్యాణ్​.

పవన్ ప్రస్తుతం మరో రెండు మూడు సినిమాలు ఒప్పుకున్నారు. క్రిష్​ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేయనుండగా.. హరీశ్​ శంకర్​తో మరో సినిమాకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం చేస్తున్న భీమ్లానాయక్​ సినిమా నుంచి విడుదలైన పోస్టర్​లు, సాంగ్​లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇటీవల వచ్చి లాలా భీమ్లా పాటకు మిలియన్ల వ్యూస్​ వస్తున్నాయి. ఈ క్రమంలోనే  సినిమా ఏ రేంజ్​లో ఉండనుందో అని అంచనాలు మొదలయ్యాయి. సాగర్ కె చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రానా కూడా ఇందులో నటిస్తున్నారు.  వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular