Bramayugam Review: వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన నటుడు మమ్ముట్టి. మళయాళ సినిమా ఇండస్ట్రీలో ఒక ధృవ తారగా ఎదిగాడు. జానర్లతో సంబంధం లేకుండా మంచి కథతో సినిమాలని చేసి సక్సెస్ లు అందుకోవడమే కాకుండా మలయాళ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కూడా ఎదిగి తనదైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇలాంటి సమయంలో మమ్ముట్టి చేసిన ప్రతి సినిమా కూడా ఏదో ఒక కొత్తదనంతో నిండిపోయి ఉంటుందని, చాలామంది అభిమానులు ఆయన సినిమాలు చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఆయన మూస ధోరణిలో వెళ్లకుండా ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటాడు. ఇక గత వారంలోనే ‘యాత్ర 2’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆయన ఈ వారం ‘భ్రమయుగం ‘ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం అయితే చేశాడు. మరి ఈ సినిమాతో మమ్ముట్టి సక్సెస్ సాధించాడా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది మంత్రాలు, తంత్రాలతో కూడిన కొన్ని దశాబ్దాల కిందటి స్టోరీ. ప్రస్తుతం దీన్ని రిప్రెజెంట్ చేస్తూ నడిచే కథ గా ఇది తెరకెక్కింది. ఒక ప్రముఖ గాయకుడి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన వల్ల ఎవరికి నష్టం జరిగింది, తనని మోసం చేసిన వారి మీద ఎలాంటి రివేంజ్ తీర్చుకున్నాడు. అనే అంశాలని సస్పెన్స్, హార్రర్ జానర్ లో మిక్స్ చేసి తెరకెక్కించిన సినిమా ఇది. ముఖ్యంగా ఈ సినిమాలో మమ్ముట్టి చేసిన రోల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పాలి…అయితే ఈ సినిమా లో మమ్ముట్టి ఎవరి మీద రివెంజ్ తీర్చుకున్నాడు అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు ‘రాహుల్ సదాశివన్’ ఈ సినిమాని ఒక డిఫరెంట్ వే లో ప్రజెంట్ చేశారనే చెప్పాలి. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ మొత్తం ఊరికి సంబంధించిన సీన్ లను బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. ఇక సెకండ్ హాఫ్ లో దానికి సంబంధించిన పే ఆఫ్ ను కరెక్ట్ గా డెలివరీ చేశాడు. ఇక ఈ క్రమంలోనే దర్శకుడి దగ్గర ఉన్న ప్రతిభా అనేది కనిపించింది. నిజానికి ఫస్టాఫ్ లో ఒక ఎంగెజింగ్ సీన్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన పాయింట్ ని సెకండ్ ఆఫ్ లో మనకు రివిల్ చేస్తాడు దర్శకుడు. అలాంటి ఒక పాయింట్స్ ను సినిమా మొదట్లో వేసి లాక్ చేయడం వల్ల ప్రేక్షకుడికి సినిమా మీద ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్ గా పెరిగిపోతూ ఉంటుంది. అందువల్లే ఈ సినిమా అధ్యంతం ఎంగేజింగ్ గా నడుస్తూ ఉంటుంది. రాహుల్ సదాశివన్ కథలో ఎంత డెప్త్ అయితే రాసుకున్నాడో డైరెక్షన్ పరంగా కూడా అదే డెప్త్ ను చూపించాడు. అనవసరమైన సీన్లు ఏమీ లేకుండా, అనవసరమైన హంగులు, అర్బటాలకు పోకుండా క్లీన్ గా, నీట్ గా ఈ సినిమాను చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.
ఇక ఆయన మేకింగ్ కి తగ్గట్టుగానే స్క్రీన్ మీద మమ్ముట్టి విలయ తాండవం చేశారనే చెప్పాలి. ఆ క్యారెక్టర్ లో ఆయన చూపించిన పర్ఫామెన్స్ అయితే నా భూతో, నా భవిష్యత్తు అనే చెప్పాలి. కొన్ని ఎమోషన్ సీన్స్ ని కూడా దర్శకుడు డీల్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే సినిమాలో అన్ని బాగున్నప్పటికీ కొన్ని సీన్స్ మాత్రం నార్మల్ జనాలకి పెద్దగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే అందులో ఉన్న డెప్త్ ను డైరెక్టర్ ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు. ఇక ఈ సినిమాలో దర్శకుడు ప్రేక్షకుడిని సీట్లో కూర్చోబెట్టాడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అయితే సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్లకు మాత్రం ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది…
టెక్నికల్ అంశాలు
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే క్రిష్ణో జేవియర్ అందించిన మ్యూజిక్ పర్లేదు, కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళిందనే చెప్పాలి. ప్రతి సీను కూడా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. కొన్ని ఎమోషన్ సీన్స్ లలో అయితే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి… ఇక ఈ సినిమా విజువల్ గా కూడా చాలా అద్భుతంగా ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం ఉండే విజువల్స్ ని రీ క్రియేట్ చేయడంలో సినిమాటోగ్రాఫర్ అయిన షేహనాద్ జలాల్ చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే ఈ సినిమా చూస్తున్నంత సేపు టీం ఎఫర్ట్ కనిపించిందనే చెప్పొచ్చు. ప్రతి క్రాఫ్ట్ వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్ లో ది బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడానికి అహర్నిశలు కష్టపడినట్టుగా చూసేవాళ్ళకి స్క్రీన్ మీద వాళ్ల కష్టం అనేది కనిపిస్తుంది…
నటినటుల పర్ఫామెన్స్
ఇక నటినటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమా మొత్తం మమ్ముట్టి మీదనే నడిచిందనే చెప్పాలి. తన భుజాల పైన ఈ సినిమాని విజయ్ తీరాలకు చేర్చడంలో మమ్ముట్టి తీవ్ర కృషి అయితే చేశాడు. మిగితా ఆర్టిస్టులు ఉన్నప్పటికీ ఒక్క మమ్ముట్టి మాత్రమే ఈ సినిమా లో మొదటి నుంచి చివరి వరకు వన్ మ్యాన్ షో చేశాడు. ఆయన పాత్రకి ఇంపార్టెన్స్ అలాంటిది, ఆయన పోషించిన పాత్రలో వందకి 100% ఒదిగిపోయి నటించడమే కాకుండా, ఒక సినిమా కోసం ఒక నటుడు ఎలా కష్టపడాలి అనేది కూడా మరోసారి ఆయనను చూసి మనం నేర్చుకోవచ్చు… ఇక మమ్ముట్టితో పాటు మిగిలిన సపోర్టింగ్ క్యారెక్టర్లందరు కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు…
ప్లస్ పాయింట్స్
కథ
మమ్ముట్టి యాక్టింగ్
కొన్ని ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్
కొన్ని సీన్లలో క్లారిటీ మిస్ అయింది.
స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం బాగా రాసుకొని ఉంటే బాగుండేది.
రేటింగ్
ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 2.5/5
చివరి లైన్
మమ్ముట్టి యాక్టింగ్ కోసమైన ఒక్కసారి ఈ సినిమా చూడవచ్చు.
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More