Brahmastra Closing Collections: ఈ ఏడాది భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాగా మన ముందుకి వచ్చిన సినిమాలలో ఒకటి రణబీర్ కపూర్ మరియు అలియా భట్ లు హీరోయిన్లుగా నటించిన బ్రహ్మాస్త్ర చిత్రం..విడుదలకు ముందే నుండి అద్భుతమైన ట్రైలర్ కట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చిన ఈ చిత్రానికి విడుదల తర్వాత నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపించింది..ముఖ్యంగా ఓపెనింగ్స్ విషయం లో ఈ సినిమా ఈ ఏడాది సంచలన విజయం సాధించిన #RRR మరియు KGF చాప్టర్ వంటి సినిమాల తర్వాతి స్థానం లో నిలిచింది అని చెప్పొచ్చు..ఇక ఈ సినిమా తెలుగు వర్షన్ మార్కెట్ ని మొత్తం డైరెక్టర్ రాజమౌళి చూసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాకి తెలుగు వెర్షన్ రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసేందుకు ఆయన సమర్పకులుగా కూడా వ్యవహరించారు.

కేవలం సమర్పకులుగా మాత్రమే తన పేరు ని వేసుకొని చేతులు దులుముకోకుండా ఈ సినిమా ప్రొమోషన్స్ లో కూడా ఆయన ఎంతో చురుగ్గా పాల్గొన్నాడు..దాని ప్రభావం ఈ సినిమాకి వసూళ్ల రూపం లో స్పష్టంగా కనిపించింది..ఈ చిత్రం తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 6 కోట్ల రూపాయలకు మాత్రమే జరిగింది..ఆ ఆరు కోట్ల రూపాయిలు ఈ సినిమా కేవలం నైజాం ప్రాంతం నుండి వసూలు చేసింది అంటే ఈ చిత్రం మన తెలుగునాట సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..అలా ఒక్క నైజాం ప్రాంతం లో మాత్రమే కాదు..సీడెడ్ , ఉత్తరాంధ్ర , ఈస్ట్ , వెస్ట్ , గుంటూరు , కృష్ణ మరియు నెల్లూరు వంటి ప్రాంతాలలో కూడా ఈ సినిమా దుమ్ము లేపేసింది.

మొత్తం మీద తెలుగు వెర్షన్ వరుకు ఈ సినిమా 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించి డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..ఒక హిందీ డబ్ సినిమా తెలుగు లో ఈ రేంజ్ హిట్ గా నిలిచి చాలా కాలమే అయ్యింది..తెలుగు లో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా ఈ చిత్రం..హిందీ వెర్షన్ లో మాత్రం కేవలం యావరేజి సినిమాగా మాత్రం నిలిచింది..మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అన్ని భాషలకు కలిపి 450 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు సమాచారం.
[…] Also Read: Brahmastra Closing Collections: ‘బ్రహ్మాస్త్ర’ మూవీ క్లో… […]