Homeఎంటర్టైన్మెంట్Brahmanandham: యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న "ఆలీతో జాలీగా" లో బ్రహ్మానందం ప్రోమో... ఏం అన్నారంటే ?

Brahmanandham: యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న “ఆలీతో జాలీగా” లో బ్రహ్మానందం ప్రోమో… ఏం అన్నారంటే ?

Brahmanandham: బ్రహ్మానందం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన వెండితెరపై కనిపిస్తే చాలు.. కడుపుబ్బా నవ్వాల్సిందే. ఎలాంటి పాత్రలోనైనా జీవించి నటించగలరు. ఇప్పటికే ఎన్నో పాత్రల్లో అలరించి నవ్వించారు. విలన్‌గా, కమెడియన్‌గా, హీరోగా ఇలా అన్ని రకాల పాత్రల్లో నటించి మెప్పించారు. కమెడియన్ గా వేల సినిమాల్లో నటించి కోట్ల మందిని కడుపుబ్బా నవ్వించారు బ్రహ్మీ. ఇటీవల ఆయన సినిమాల్లో కనిపించడం తగ్గించారు. ఆయన చివరగా జాతిరత్నాలు సినిమాలో నటించారు. అయితే ఇప్పుడు ఈ టీవి ఛానల్ లో ఆలీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న “ఆలీతో జాలీగా” షో కు గెస్ట్ గా హాజరయ్యారు.

brahmanandham in alitho jollyga show promo goes viral on social media

ఈ మేరకు తాజాగా ఈ షో కు సంబంధించిన ప్రోమో ను విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అలీకి బ్రహ్మానందానికి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదివారు, ఎక్కడ సెటిల్ అయ్యారు అని అలీ ప్రశ్నించగా… బ్రహ్మీ సరదాగా నవ్వుతూ నీకెందుకురా అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత అలీని తొలిసారి ఎక్కడ కలిసారో ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారో చెప్పుకొచ్చారు బ్రహ్మానందం.

ఇక చివరిగా ఆయన మీమర్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు బ్రహ్మానందం. మీమ్స్ క్రియేట్ చేసిన వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నా అంటూ బ్రహ్మానందం అన్నారు. కొన్ని కారణాల వల్ల ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చానని, అయినా నన్ను మర్చిపోకుండా చేసేది వాళ్లు మాత్రమే అని మీమర్స్ గురించి గొప్పగా చెప్పారు. వాళ్ళ మీద కోప్పడటం చేయను అన్నారు. బ్రహ్మీ తమకు ఇంతగా సపోర్ట్ చేయడంతో మీమర్స్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్థ్హుతఃమ్ ఈ ప్రోమో సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular