Brahmanandam: తెలుగు వాళ్లకు హాస్యం అంటే మహా ఇష్టం. ఐతే, ఆ హాస్యానికి బ్రహ్మానందం అనే పేరు పర్యాయపదం అయిపోయింది. అంత గొప్ప నేటి కమెడియన్ గా కామెడీలో ఒక లెజండ్ గా బ్రహ్మానందం పేరు నిలిచిపోయింది. ఏది ఏమైనా తెలుగు వెండితెరపై బ్రహ్మానందం గిలిగింతలు పెట్టినంతగా మరో హాస్య నటుడు పెట్టలేదు. దిగ్గజ హాస్యనటుడు రేలంగి లాంటి మహానటుడు కూడా మంచి హాస్యాన్ని మాత్రమే అందించాడు.

కానీ, బ్రహ్మానందంలా విరగబడి నవ్వే హాస్యాన్ని ఇవ్వలేదు. అందుకే, నేటి తరానికి బ్రహ్మానందం ఓ హాస్యచక్రవర్తి. ఎన్నో హాస్య పాత్రలకు నిలువెత్తు ఆలవాలం బ్రహ్మానందం. అన్ని వర్గాల ప్రేక్షకులని తన ఫన్నీ భావోద్వేగాలతో మంత్రముగ్ధుల్ని చేసిన గొప్ప హాస్య నటుడు బ్రహ్మానందం. హాస్యంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న తిరుగులేని రారాజు బ్రహ్మానందం.
అందుకే బ్రహ్మానందం అంటే.. ప్రతి హీరోకి, ప్రతి దర్శకుడికి ఎంతో ఇష్టం. అయితే, ఈ మధ్య కాలంలో బ్రహ్మానందం దూకుడు తగ్గింది. ఆయనకు గతంలో లాగా మంచి క్యారెక్టర్స్ పడలేదు. దాంతో బ్రహ్మానందం సరైన సినిమాలో నటించి దాదాపు నాలుగేళ్లు కావొస్తోంది. అయితే, బ్రహ్మానందం మళ్ళీ సినిమాల్లో బిజీ కావడానికి సర్వం సిద్ధం అయ్యాడట.
Also Read: Pushpa Movie: త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి అప్డేట్ ఇవ్వనున్న “పుష్ప” యూనిట్…
ఇప్పటికే, భీమ్లా నాయక్ లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కీలక పాత్ర అంటే.. సీరియస్ పాత్ర కాదు, సినిమా మొత్తం నడిచే పక్కా కామెడీ పాత్ర. అయితే, రంగమార్తాండ సినిమాలో మాత్రం బ్రహ్మానందం సీరియస్ రోల్ లో కనిపించబోతున్నాడు. అలాగే శర్వానంద్, నితిన్, గోపీచంద్ లాంటి హీరోల సినిమాల్లో కూడా బ్రహ్మానందం తనదైన హాస్యాన్ని పడించబోతున్నాడు.
Also Read: Tollywood: ప్రముఖ హీరో శింబు సినిమా రీమేక్ లో సాయి ధరమ్ తేజ్ నటించనున్నాడా…