Pushpa Movie: చిత్ర పరిశ్రమలో హీరోలకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ అభిమాన హీరో కోసం ఫ్యాన్స్ ఎలాంటి పనులైనా చేస్తారు. వారి పుట్టిన రోజులకు, సినిమా విడుదల సమయంలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఆ అభిమానం హద్దులు దాటకుండా ఉన్నంత వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో మా హీరో సినిమా మంచిగా తీయకపోతే చంపేస్తాం, ఎలివేషన్స్ సరిగ్గా లేకపోతే డైరెక్టర్లను ట్రోల్ చేయడం, అప్డేట్స్ లేట్ గా ఇస్తే నిర్మాణ సంస్థపై మండిపడడం చూస్తూనే ఉంటున్నాం. అయితే ఇప్పుడు తాజాగా ఒక అభిమాని మాత్రం సినిమా ఏదైనా తేడాకొడితే చచ్చిపోతాను అని ట్వీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.

Also Read: సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసిన అల్లు అర్జున్ “పుష్ప: సినిమా…
ఈ తరుణంలో టాలీవుడ్ లో అలలు అర్జున్ అభిమాన సైన్యం గురించి తెలిసిందే. అల్లు అర్జున్ ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పుష్ప” అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూసిన ఒక అభిమాని షాకింగ్ డెసిషన్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. “ట్రైలర్ చూసి నా మనసు చచ్చిపోయింది..ఇంకా నా వల్ల కాదు. ఇన్ని రోజులు మీకు చాలా గౌరవం ఇచ్చి ట్వీట్ వేశాను. పుష్ప సినిమా ఏమైనా తేడా కొడితే మొదటి రోజే నా చావు చూస్తారు.. ఒట్టు వేసి ఒక మాట వేయకుండా ఒక మాట నేను చెప్పను ట్విట్టర్‌కు గుడ్ బై.. ” అంటూ చెప్పుకొచ్చాడు. సినిమా హిట్ అవ్వకపోతే చచ్చిపోతా లాంటి షాకింగ్ డెసిషన్స్ తీసుకోకూడదు అంటూ నెటిజన్లు అతనికి హితబోధ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ ట్వీట్ గురించి పలువురు అతన్ని ప్రశ్నించగా తాను జోక్ చేసినట్లు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Good bye to TWITTER
Trailer chusi naa manasu chacchipoyindhi
Inka naa valla kaadhu.Inni Days meeku chaala respect icchi
Tweet vesaanu @aryasukku sirr#Pushpa movie emaina theda kodithe
First day ne naa Chaavu chustaru "Ottu vesi oka Mata veyakunda oka mata nenu chepanu😭🙏 pic.twitter.com/84T9MCA8Tc— RAAjesh Bunny™⛏️🥁💥 (@RajeshBunny654) December 7, 2021
Also Read: బాప్ రే.. పుష్ప మూవీ అన్ని గంటలా?