Boycott RRR In Karnataka: ప్రస్తుతం దేశమంతా టాప్ వన్ ట్రెండింగ్ లో నడుస్తున్న ఆర్.ఆర్ ఆర్ మూవీ మరో వివాదంలో చిక్కుకుంది. మొదటి నుంచి ఈ మూవీపై ఏదో ఒక నెగెటివ్ వార్త వినిపిస్తూనే ఉంది. రేపు రిలీజ్ కాబోతున్న ఈ మూవీని కర్ణాటకలో బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో హాష్ ట్యాగ్స్ వెల్లువెత్తుతున్నాయి. అసలు కన్నడ భాషలో ఎందుకు బ్యాన్ చేయాలనుకుంటున్నారు అనే విషయంపై ఓ లుక్కేద్దాం.
కన్నడ ప్రజలు మొదటినుంచి భాషకు ప్రాణం ఇస్తారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆర్.ఆర్ ఆర్ మూవీ కన్నడ భాషలో రిలీజ్ కావట్లేదని.. అందుకే ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. తమ భాషలో సినిమా రిలీజ్ చేయకపోవడం కన్నడ భాషకు అది పెద్ద అవమానం అంటూ.. కొందరు ట్వీట్లు చేస్తున్నారు.
Also Read: RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసి నోట మాట రాని డిస్ట్రిబ్యూటర్స్?
ఈ ట్వీట్లను మరికొందరు రీట్వీట్ చేస్తూ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లను ట్యాగ్ చేస్తున్నారు. కొందరేమో కన్నడ భాషలో తక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారని, తమ ప్రాంతంలో తెలుగులోనే ఎక్కువ రిలీజ్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. మరికొందరేమో అసలు కన్నడ భాష లోనే సినిమాను రిలీజ్ చెయ్యట్లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరేమో వీరికి కౌంటర్లు కూడా వేస్తున్నారు.
కర్ణాటకలో కన్నడ భాషలో రిలీజ్ చేస్తున్న ధియేటర్లలో టికెట్లు అమ్ముడుపోవడం లేదని.. అదే తెలుగులో రిలీజ్ చేస్తున్న ధియేటర్లలో హౌజ్ ఫుల్ అవుతున్నాయని.. మీరు టికెట్లు బుక్ చేసుకోకుండా ఈ రాద్ధాంతం ఏంటంటూ త్రిబుల్ ఆర్ టీంకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే.. కర్ణాటకలో ఎక్కువ థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయకపోవడం.
కర్ణాటకలో కన్నడ భాష కంటే తెలుగు భాషలోనే ఎక్కువ థియేటర్లలో సినిమా రిలీజ్ అవుతుందని సమాచారం. దీంతో తమ ప్రాంతంలో తమ భాషకు విలువ ఇవ్వట్లేదని మండిపడుతున్నారు కన్నడిగులు. అదే కేజిఎఫ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషలోనే రిలీజ్ చేస్తున్నారని.. అలాంటప్పుడు కన్నడ భాషలో ఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీని ఎందుకు రిలీజ్ చేయరని.. ఒకరిద్దరు నెటిజన్లు మొదలెట్టిన హాష్ ట్యాగ్ ల పర్వం.. ఇప్పుడు సినిమాను వివాదంలో పడేసింది. మరి దీనిపై త్రిబుల్ ఆర్ టీం ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.
Also Read:Jobs: ఎట్టకేలకు నిరుద్యోగుల ‘ఆకలి’ తీర్చనున్న కేసీఆర్
Recommended Video: