Homeఎంటర్టైన్మెంట్కరీనా వద్దు కంగనానే ముద్దు.. ఇది సీత ‘రామాయణం’ !

కరీనా వద్దు కంగనానే ముద్దు.. ఇది సీత ‘రామాయణం’ !

Kareena Kapoor Khan kangna ranautనేషనల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ‘రామాయణం’ కథని సీత పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పే ఆలోచనతో ‘సీత’ అనే ఓ పౌరాణిక కథను రాశారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయింది. మొదట ‘సీత’ పాత్రలో దీపిక పదుకోన్ ఐతే బాగుంటుంది అనుకున్నా.. ఆ తర్వాత దర్శక, నిర్మాతలు కరీనా కపూర్ ను ఖరారు చేసుకున్నారు. ఆమె కూడా ఆ పాత్ర చేయడానికి ఒప్పుకుంది.

అయితే, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి తాజాగా నిర్మాతలు షెడ్యూల్స్ ప్లాన్ చేస్తూ.. రెమ్యునరేషన్ లను కూడా ఫిక్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో కరీనా కపూర్ కి దాదాపు 9 కోట్లు వరకు కేటాయించారు. అయితే, కరీనా మాత్రం తనకు 12 కోట్లు కావాలంటూ డిమాండ్ చేసింది. కరీనా ఫామ్ లో ఉన్న హీరోయిన్ కాదు కదా, పైగా ఇద్దరు బిడ్డలకు తల్లి, అలాంటి ఆమె 12 కోట్లు డిమాండ్ చేయడం ఏమిటి అంటూ షాక్ అయ్యారు నిర్మాతలు.

మొత్తానికి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. దాంతో, కరీనా కపూర్ ను సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తూ.. ‘సీత’ పాత్రలో నటించే అవకాశం వస్తే.. కళ్ళు మూసుకొని ఒప్పుకోవాలి గానీ, అంత కావాలి, ఇంత కావాలి అని డిమాండ్స్ చేయడం ఏంటి ?’ అంటూ కరీనాని తెగ ట్రోల్ చేస్తున్నారు. పనిలో పనిగా కరీనాకి వయసు అయిపోయిందని, ఆమెలో మునపటి పట్టు లెదని ఆమె యాంటీ ఫ్యాన్స్ ఆమె పై విరుచుకుపడుతున్నారు.

పైగా కరీనా కపూర్ లాంటి ముదిరిపోయిన బ్యూటీ కంటే, అసలు సిసలు ‘హిందూ నారి’ అయిన కంగనా రనౌత్ ను సీత పాత్ర కోసం తీసుకోండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు నెటిజన్స్. మరి మేకర్స్ నెటిజన్ల సలహాను ఫాలో అవుతారా లేదా అనేది చూడాలి. నిజంగా మార్కెట్ పరంగా చూసుకున్నా.. కరీనా కపూర్ కంటే కూడా, కంగనా రనౌతే బెటర్ ఆప్షన్. మరి చూడాలి మేకర్స్ ఎవరితో ముందుకు పోతారో.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version