https://oktelugu.com/

చిరంజీవి ఫోన్ కోసం ఎదురుచూస్తున్న స్టార్ డైరెక్టర్

మెగాస్టార్ చిరంజీవి తదుపరి పనిచేయాలన్న దర్శకుల జాబితాలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడ ఒకరు. ‘వినయ విధేయ రామ’ తర్వాత ఆయన బాలకృష్ణతో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. కానీ అది ఆలస్యం కావడంతో మెగాస్టార్ చిరంజీవితో కమిటవ్వాలని అనుకున్నారు. బోయపాటి స్టోరీ లైన్ చెప్పడం, చిరు ఓకే చేయడం, అల్లు అరవింద్ నిర్మాణ బాధ్యతయాలను తీసుకోవడానికి ముందుకురావడంతో ప్రాజెక్ట్ దాదాపు ఫైనల్ అయిపోయింది. కానీ ‘వినయ విధేయ రామ’ రిజల్ట్ ఎఫెక్టో ఏమో కానీ […]

Written By: , Updated On : October 24, 2020 / 07:26 PM IST
Follow us on

Chiranjeevi Upcoming Movies
మెగాస్టార్ చిరంజీవి తదుపరి పనిచేయాలన్న దర్శకుల జాబితాలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడ ఒకరు. ‘వినయ విధేయ రామ’ తర్వాత ఆయన బాలకృష్ణతో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. కానీ అది ఆలస్యం కావడంతో మెగాస్టార్ చిరంజీవితో కమిటవ్వాలని అనుకున్నారు. బోయపాటి స్టోరీ లైన్ చెప్పడం, చిరు ఓకే చేయడం, అల్లు అరవింద్ నిర్మాణ బాధ్యతయాలను తీసుకోవడానికి ముందుకురావడంతో ప్రాజెక్ట్ దాదాపు ఫైనల్ అయిపోయింది. కానీ ‘వినయ విధేయ రామ’ రిజల్ట్ ఎఫెక్టో ఏమో కానీ చిరు మనసు మార్చుకున్నారు.

Also Read: ప్రభాస్ దెబ్బకు ఇండియా వైడ్ రికార్డులన్నీ ఖల్లాస్ !

మరొక స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ‘ఆచార్య’ను పట్టాలెక్కించారు. దీంతో బోయపాటి సినిమా అటకెక్కినట్టే అనుకున్నారు అందరూ. బోయపాటి సైతం బాలయ్య సినిమా సన్నాహాల్లో పడిపోయారు. కానీ తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న మాటల మేరకు వీరి ప్రాజెక్ట్ జస్ట్ ఆగింది కానీ పూర్తిగా క్యాన్సిల్ అయిపోలేదట. చిరంజీవి జాబితాలో బోయపాటి పేరు అలానే ఉందట. ప్రజెంట్ చేస్తున్న ‘ఆచార్య’ పూర్తయ్యాక మెహర్ రమేష్, వివి.వినాయక్ సినిమాలు చేసేసి బోయపాటికి అవకాశం ఇవ్వాలని చిరు భావిస్తున్నారట.

Also Read: క్రిష్ మామూలోడు కాదు.. పవన్‌కే షాకిచ్చాడు !

ఒకవేళ ‘ఆచార్య’ తర్వాత చిరు లైన్లో పెట్టిన రెండు సినిమాలకు మధ్యలో కొంత గ్యాప్ దొరికినా బోయపాటికి మెగా కాంపౌండ్ నుండి కబురు వెళ్ళవచ్చట. అందుకే బోయపాటి చిరు ఇష్టపడిన స్టోరీ లైన్ ను డెవలప్ చేస్తున్నారట. మెగాస్టార్ నుండి ఎప్పుడైనా ఫోన్ రావచ్చని ఈలోపు బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకుంటే బెటరని వర్క్ చేస్తున్నారట. మరి బోయపాటికి చిరు నుండి ఎప్పుడు పిలుపు వెళుతుందో చూడాలి. ఇకపోతే బోయపాటి ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కూడ ఒక సినిమా చేయాలని కమిటయ్యారు.