Akhanda 2: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ గా నిల్చిన చిత్రాల్లో ఒకటి ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu). ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ ఏడాది జులై 24 వ తేదీన విడుదలై ప్రీమియర్ షోస్ నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. సనాతన ధర్మం కాన్సెప్ట్ మీద ఈ చిత్రం తెరకెక్కింది అంటూ మొదటి నుండి మూవీ టీం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అసలే వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రం పై ఫ్యాన్స్ లోనే అంచనాలు లేవు, పైగా సనాతన ధర్మం పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఇందులో కనిపించబోతున్నాడు అని ప్రచారం చేసేసరికి, ఇదొక ఎజెండా సినిమా అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. దానికి తోడు నాసిరకమైన VFX షాట్స్ సినిమా మొత్తం ఉండడంతో అభిమానులు ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు.
ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి రెండు మూడు ప్రధాన కారణాల్లో ఒకటి సనాతన ధర్మం కాన్సెప్ట్ మీద తెరకెక్కడం, మరొకటి గ్రాఫిక్స్. ఇప్పుడు ‘అఖండ 2 ‘(Akhanda 2 Movie) చిత్రం కూడా సనాతన ధర్మం కాన్సెప్ట్ మీదనే తెరకెక్కింది అట. ఇది ఈ చిత్రానికి బ్యాక్ ఫైర్ అవుతుందేమో అనే భయం నందమూరి ఫ్యాన్స్ లో ఉంది. అంతే కాకుండా రీసెంట్ గా విడుదల చేసిన ‘అఖండ తాండవం’ టైటిల్ సాంగ్ లో గ్రాఫిక్స్ చాలా చీప్ గా అనిపించాయి. సెట్టింగ్స్ వేసినట్టు స్పష్టంగా కళ్ళకు తెలుస్తోంది, ఇలా అయితే ఈ సినిమా కూడా ‘హరి హర వీరమల్లు’ లాగా మిస్ ఫైర్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. కానీ ఎంతైనా సీక్వెల్ క్రేజ్ తో వస్తున్న సినిమా కాబట్టి ఓపెనింగ్స్ వరకు తెలుసు రాష్ట్రాల్లో కుమ్మేయొచ్చు. కానీ ఓవర్సీస్ లో మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ కి దారుణమైన రెస్పాన్స్ వచ్చింది.
నందమూరి ఫ్యాన్స్ ఈ చిత్రం తో వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను మొదటి రోజు కొల్లగొట్టి, ఫుల్ రన్ లో 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతామని బలమైన నమ్మకం తో సవాళ్లు విసిరారు. కానీ తీరా చూస్తే అక్కడ సూపర్ హిట్ టాక్ వచ్చినా 150 కోట్ల గ్రాస్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటి వరకు విడుదలైన ఒక్క ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమా పై అంచనాలను పెంచలేకపోయింది. కనీసం థమన్ తన మ్యూజిక్ తో సినిమా పై హైప్ లేపుతాడు అని అనుకుంటే, ఆయన కూడా ఈ సినిమాకు హ్యాండ్ ఇచ్చేలాగానే కనిపిస్తున్నదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.