KTR: ఐటీ మంత్రి కేటీఆర్.. బీజేపీ టెక్నాలజీ దెబ్బకు భయపడిపోతున్నాడా?

KTR: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్.. ఆ రంగంలో.. ఆ శాఖలో ఆరితేరిపోయాడు. తెలంగాణకు ఐటీ పెట్టుబడులు తేవడంలో ప్రభుత్వంలో ఆన్ లైన్ సేవలు చేయడంలోనూ కేటీఆర్ విప్లవాత్మక మార్పులు తెచ్చాడు. తెలంగాణ ప్రభుత్వాన్ని సాంకేతికంగా ముందుకు నడిపించాడు. కానీ ఇప్పుడు అదే ఐటీ తో భయపెడుతున్న బీజేపీకి మంత్రి కేటీఆర్ భయపడుతుండడం విశేషం. కామారెడ్డిలో ఈరోజు జరిగిన నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ […]

Written By: NARESH, Updated On : November 9, 2021 7:01 pm
Follow us on

KTR: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్.. ఆ రంగంలో.. ఆ శాఖలో ఆరితేరిపోయాడు. తెలంగాణకు ఐటీ పెట్టుబడులు తేవడంలో ప్రభుత్వంలో ఆన్ లైన్ సేవలు చేయడంలోనూ కేటీఆర్ విప్లవాత్మక మార్పులు తెచ్చాడు. తెలంగాణ ప్రభుత్వాన్ని సాంకేతికంగా ముందుకు నడిపించాడు. కానీ ఇప్పుడు అదే ఐటీ తో భయపెడుతున్న బీజేపీకి మంత్రి కేటీఆర్ భయపడుతుండడం విశేషం.

KT_Rama_Rao_sad

కామారెడ్డిలో ఈరోజు జరిగిన నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో టీఆర్ఎస్ కార్యకర్తలు విజృంభించి బీజేపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపునివ్వడం సంచలనమైంది. అదేవిధంగా కేంద్రమే వరి కొనుగోలు చేయాలంటూ ఈనెల 12న ఆందోళనలు నిర్వహించి బీజేపీ మెడల్ వంచే విధంగా ధర్నా చేయాలని కేటీఆర్ సూచించడం విశేషం.

రాష్ట్రానికి ఐటీశాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్.. ఐటీలో ఆరితేరిన కేటీఆర్ తన పార్టీ కార్యకర్తలకు సోషల్ మీడియాలో విజృంభించాలనడం హాట్ టాపిక్ గా మారింది. దీన్ని బట్టి బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తలతో పోలిస్తే టీఆర్ఎస్ వాళ్లు వెనుకబడ్డారని తెలుస్తోంది.

నరేంద్రమోడీ వచ్చాక సోషల్ మీడియాను బాగా వాడేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు సైతం అదే బాటలో అన్ని రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో విజృంభిస్తున్నారు. ప్రత్యర్థులను చెడుగుడు ఆడేస్తున్నారు. ఇందులో టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్, కార్యకర్తలు పెద్దగా ప్రభావం చూపించడం లేదు. అందుకే కేటీఆర్ ఆ లోపాన్ని గుర్తించి సోషల్ మీడియాను ఆయుధంగా వాడాలని.. విజృంభించాలని కోరాడు. దీన్ని బట్టి బీజేపీ సోషల్ మీడియా దెబ్బ కేటీఆర్ కు బాగానే తగులుతోందని అర్థమవుతోంది.