https://oktelugu.com/

Boyapati Sreenu Mahesh Babu Pan India Movie: మహేష్ బాబు – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ

Boyapati Sreenu Mahesh Babu Pan India Movie: అఖండ వంటి భారీ సెన్సషనల్ హిట్ తర్వాత బోయపాటి శ్రీను ప్రస్తుతం హీరో రామ్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించారు హీరో రామ్..ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక్క సినిమా చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు అట..ఈ సినిమాని భారీ బడ్జెట్ తో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 18, 2022 / 05:10 PM IST
    Follow us on

    Boyapati Sreenu Mahesh Babu Pan India Movie: అఖండ వంటి భారీ సెన్సషనల్ హిట్ తర్వాత బోయపాటి శ్రీను ప్రస్తుతం హీరో రామ్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించారు హీరో రామ్..ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక్క సినిమా చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు అట..ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కిస్తాడు అట బోయపాటి శ్రీను..ఎప్పటి నుండో ఈయన సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక్క సినిమా చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..బోయపాటి శ్రీను తో చెయ్యడానికి మహేష్ బాబు సుముఖత చూపించినప్పటికీ ఎందుకో వీళ్లిద్దరి కాంబినేషన్ ఇన్నేళ్లు సెట్స్ పైకి రాలేదు..కానీ ఇటీవలే స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేసి మహేష్ ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ వినిపించిన తర్వాత మహేష్ ఓకే చెప్పాడు అని..బోయపాటి శ్రీను తీసుకున్న పాయింట్ మహేష్ బాబు కి ఎంతగానో నచ్చింది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

    Boyapati Sreenu Mahesh Babu Pan India Movie

    మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా ఇటీవలే ప్రారంభం అయ్యాయి..జూన్ నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది..ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను తో మహేష్ సినిమా ఉండబోతుంది అని తెలుస్తుంది..ఈ సినిమా షూటింగ్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా 5 నెలల లోపే పూర్తి చెయ్యాలని మహేష్ బాబు బోయపాటి ఒక్క స్ట్రిక్ట్ కండిషన్ పెట్టినట్టు సమాచారం..ఎందుకంటే వచ్చే ఏడాది సెప్టెంబర్ నెల నుండి మహేష్ బాబు రాజమౌళి తెరకెక్కించబోయ్యే సినిమా రెగ్యులర్ షూటింగ్ కి షిఫ్ట్ అయిపోతాడు..ఈలోపు ఈ రెండు సినిమాల షూటింగ్స్ ని పూర్తి చేసి అభిమానుల ముందుకు రావడానికి మహేష్ చూస్తున్నాడు అట..ఇప్పటి వరుకు మహేష్ లో ఎవ్వరు చూడని ఊర మాస్ యాంగిల్ ని బోయపాటి శ్రీను ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాడు అట.

    Also Read: జబర్దస్త్ కి హైపర్ ఆది గుడ్ బై

    ఇది ఇలా ఉండగా బోయపాటి శ్రీను తో సినిమా అంటే మహేష్ బాబు అభిమానులు కాస్త భయపడుతున్నారు అట..ఎందుకంటే బోయపాటి నందమూరి బాలకృష్ణ తో తప్ప ఆయన నేటి తరం స్టార్ హీరోలతో చేసిన సినిమాలు ఎక్కువ శాతం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్స్ గా నిలిచాయి..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేసిన సరైనోడు సినిమా మినహా రామ్ చరణ్ తో చేసిన వినయ విధేయ రామ మరియు ఎన్టీఆర్ తో చేసిన దమ్ము సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఫ్లాప్స్ గా నిలిచాయి..మరి బోయపాటి ఊర మాస్ హీరో టేకింగ్ కి మహేష్ బాబు అయినా సరిపోతాడా లేదా అని అభిమానులు కంగారు పడుతున్నారు..కానీ బోయపాటి శ్రీను ఈ సినిమాని తన స్టైల్ లో కాకుండా మహేష్ స్టైల్ కి తగ్గట్టు స్క్రిప్ట్ ని డెవలప్ చేసాడు అట..కాబట్టి ఈ సినిమా కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ అవుతుంది అని మహేష్ గట్టిగా నమ్మాడు కాబట్టే ఈ ప్రాజెక్ట్ కంఫర్మ్ అయ్యింది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలియాలి అంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.

    Also Read: అంతర్జాతీయ స్థాయిలో అరుదైన రికార్డు సృష్టించిన హీరో మాధవన్ కొడుకు

    Recommended Videos:

    Tags