Telugu Bigg Boss Non Stop: తెలుగులో నంబర్ 1 రియాలిటీ షో ‘బిగ్ బాస్ ఓటీటీ’ దూసుకెళుతోంది. బలమైన కంటెస్టెంట్లను దించడంతో ఈ షో హంగామా ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది. 17మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షో ఇప్పటికే సగం పూర్తయ్యింది. ఒక్కో వారం ఒక్కో కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుండడంతో ఈ ఆదివారానికి ఏడుగురు హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు.
ఈ ఆదివారం ప్రముఖ కమెడియన్ మహేష్ విట్టా హౌస్ నుంచి బయటకు వచ్చాడు. స్టేజ్ మీద నుంచి పలువురి ఆట తీరు గురించి అతడు కుండబద్దలు కొట్టాడు. తాజాగా బయటకు వచ్చిన మహేష్ విట్టా ఈసారి బిగ్ బాస్ ఓటీటీ విజేత ఎవరు? టాప్ 5లో ఎవరుంటారన్న దానిపై క్లారిటీ ఇచ్చాడు.

ప్రేక్షకుల ఒపినియన్ పై ఆధారపడి ఉన్నా కూడా బిగ్ బాస్ టాప్ 5లో ఈసారి బింధుమాధవి, అఖిల్, శివ ఉంటారని మహేష్ విట్టా తెలిపాడు. ఇక అరియానాకు టాప్ 5లో చాన్స్ ఉంటుందని అన్నాడు. బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశాలు బింధుమాధవి, అఖిల్, శివలకే ఉంటాయని తెలిపారు. కానీ ఈ ముగ్గురి ఎవరనేది చెప్పలేనని మహేష్ తెలిపాడు.
Also Read: Ganta Srinivasa Rao: గంటా శ్రీనివాసరావు భారీ స్కెచ్.. ఏకతాటిపైకి పాత‘కాపు’లు
ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం.. బిగ్ బాస్ లో అందరికంటే బాగా ఆడుతూ అత్యధిక ఓట్లతో ప్రేక్షకాదరణ పొందుతోంది హీరోయిన్ బిందుమాధవి. ఆమె తర్వాత అఖిల్ రేసులో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకరు ఈసారి బిగ్ బాస్ ఓటీటీ విజేతగా కావడం ఖాయమని ప్రచారం సాగుతోంది. హౌస్ లో టామ్ అండ్ జెర్రీలా వీరిద్దరూ విడిపోయి రెండు జట్లుగా కొట్టుకుంటున్నారు. అయితే అఖిల్ మరీ ఓవరాక్షన్ చేస్తుండడంతో అతడిపై వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది.
తాజాగా మహేష్ విట్టా కూడా టాప్ 3లో అఖిల్, బిందులను చేర్చాడు. సో ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం చూస్తే బిందుమాధవికే ఛాన్స్ ఉటుందని అంటున్నారు. ఎవరవుతారన్నది మరొకొన్ని వారాలు గడిస్తే కానీ చెప్పలేని పరిస్థితి. అప్పటివరకూ ఎదురుచూడాల్సిందే..
Also Read: Janasena: మత్స్యకారులకు ఆశాదీపంగా పవన్ కళ్యాణ్.. జనసేన వైపు గంగపుత్రుల చూపు